Begin typing your search above and press return to search.
సక్సెస్ అనేది గమ్యం కాదు .. ప్రయాణం!
By: Tupaki Desk | 6 Dec 2021 11:00 AM ISTనాగశౌర్య - కేతిక శర్మ జంటగా 'లక్ష్య' సినిమా నిర్మితమైంది. సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఒక వై్పున స్నేహం .. మరో వైపున ప్రేమ .. ఇంకో వైపున ఆశయం అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పల్లెకీ .. పట్నానికి మధ్య, ఆవేశానికి .. ఆక్రోశానికి మధ్య ఈ కథ నడుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఆవిష్కృతమయ్యే సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధానమైన బలం. అలాంటి ఈ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై దర్శకుడు సంతోష్ మాట్లాడాడు.
"నా తల్లిదండ్రులకు .. నా మొదటి సినిమాకి చాన్స్ ఇచ్చిన నిర్మాతకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
'సుబ్రమణ్యపురం' నా ఫస్టు మూవీ. ఆ తరువాత ఈ కథ వినగానే 'మనం ఈ సినిమా చేస్తున్నాము' అని నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత సునీల్ నారంగ్ గారు. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక రామ్మోహన్ రావుగారు .. శరత్ గారితో కూడా రెండేళ్లుగా జర్నీ చేస్తూ చాలా నేర్చుకున్నాను.
ఈ సినిమా కథ తీసుకుని నేను నాగశౌర్యగారి దగ్గరికి వెళ్లాను. మూడున్నర గంటలసేపు ఆయనకి నేను కథ చెప్పాను .. అది కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఆయన ఎంతో ఓపికగా విన్నారు. సెకండాఫ్ సెకండ్ డే నాలుగు గంటలు చెప్పాను. అంతా విన్న తరువాతనే ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
అలా ఆయన ఒప్పుకున్న రోజు నుంచి ఈ స్టేజ్ వరకు నాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సృజనమణి గారి డైలాగ్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఆయన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి .. మనసును పట్టుకుంటాయి. కావాలని రాసినట్టుగా కాకుండా చాలా సహజంగా అనిపిస్తాయి.
సినిమా అనేది సమష్టి కృషి. మమ్మల్ని నిద్రలేపి లొకేషన్ కి తీసుకునివెళ్లే డ్రైవర్ల దగ్గర నుంచి, లొకేషన్ లో వాటర్ ఇచ్చే వారి వరకూ అందరి సపోర్టుతోనే ఈ సినిమా పూర్తిచేయగలిగాము.
సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు .. ఒక జర్నీ. ఆ జర్నీయే మీరు డిసెంబర్ 10వ తేదీన చూసే 'లక్ష్య' సినిమా. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడండి ... ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాతో నాగశౌర్యకి హిట్ పడుతుందనే అనుకుంటున్నాను. నా నమ్మకం నిజమవుతుందనే భావిస్తున్నాను " అని చెప్పుకొచ్చాడు.