Begin typing your search above and press return to search.

అప్పట్లో 'పంజా' సినిమా ఫంక్షన్ కి వెళితే తోసేశారు!

By:  Tupaki Desk   |   23 Feb 2022 6:24 PM GMT
అప్పట్లో పంజా సినిమా ఫంక్షన్ కి వెళితే తోసేశారు!
X
'భీమ్లా నాయక్' సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో .. అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు సాగర్ కె చంద్ర మాట్లాడుతూ .. "నల్గొండ నుంచి ఒక డైరెక్టర్ ను కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల నా కెరియర్లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సపోర్టుగా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక సంఘటనను గుర్తుచేసుకోవాలి. అప్పట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవాడిని. గచ్చిబౌలి స్టేడియంలో 'పంజా' ఆడియో ఫంక్షన్ జరుగుతోంది.

ఎలాగైనా పవన్ గారిని చూడాలనే ఉద్దేశంతో ఒక పాస్ సంపాదించుకుని వెళ్లాను. కానీ అది అంత సింపుల్ కాదని అక్కడికి వెళ్లిన తరువాత అర్థమైంది. మూడు సార్లు ప్రయత్నించినా తోసి బయటపడేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చి .. పవన్ గారిని డైరెక్ట్ చేసి .. మీ ముందు మాట్లాడటం నాకు ఒక అద్భుతంగా అనిపిస్తోంది. నా కల ఎందుకు నిజమైందంటే నా చుట్టూ ఉన్న మంచి వాళ్ల వలన నిజమైంది. నాతో పాటు ఈ సినిమాకి పనిచేసిన టీమ్ కి ఒక థ్యాంక్స్ చెబితే సరిపోదు. రానా గారి విషయానికి వస్తే ఆయన ఎనర్జీ అంతా ఇంతా కాదు.

జీవితంలో ఇంకా ఎవరిలానైనా బతికే అవకాశం నాకు ఆ దేవుడు ఇస్తే రానాలా బతకడానికి ట్రై చేస్తాను. అలాగే నిత్యామీనన్ గారికీ .. సంయుక్త మీనన్ గారికి .. సముద్రఖనిగారికి .. రావు రమేశ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అంతా కూడా ఎంతగానో కష్టపడ్డారు. వాళ్లందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిర్మాత నాగవంశీ గారు నన్ను ఈ ప్రాజెక్టులోకి తీసుకు వచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే చినబాబుగారు నన్ను ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు.

ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు బ్యాక్ బోన్ వంటివారు .. ఆయన లేకపోతే 'భీమ్లా నాయక్' లేదు. త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే చేస్తూ .. డైలాగ్స్ రాస్తూ ఒక బ్యాక్ బోన్ లా నిలిచారు. నా కంటే ఈ సినిమా కోసం ఆయన ఎక్కువగా తాపత్రయ పడ్డారు. నేను చాలా మంది నుంచి విషయాలు తీసుకునున్నాను. కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయనతో కలిసి చేసిన ప్రయాణాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. నా హృదయంలో ఆయనకి ఎప్పుడూ టీచర్ స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.

ఇక పవన్ సార్ విషయానికి వస్తే .. ఆయనను చూసి ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలని అనుకున్నాను. కానీ ఇక్కడి వరకూ వచ్చాను. పవన్ గారికి తన పేరు ముందు పీఎస్ అనిపించుకోవడం ఇష్టం ఉండదు. నేను ఎక్కడికి వెళ్లినా పవన్ కల్యాణ్ అంటే ఏమిటి? అనే అంతా అడుగుతున్నారు. ఒక గజల్ లో చెప్పినట్టు .. "గెలుపు అనే మోజులేదు .. ఓడిపోతామనే భయం లేదు .. చావే అంతం కానున్నప్పుడు చావుకు మాత్రం ఎందుకు భయపడతాం .. వెళ్లి ఆకాశంలో నుంచి గర్జించు" అనే మాటలే ఆయనకి సరిపోతాయి" అంటూ చెప్పుకొచ్చాడు.