Begin typing your search above and press return to search.

వ‌ర్మతో జ్యోతి `త‌కిట త‌క‌ట‌ తందానా`!

By:  Tupaki Desk   |   31 Aug 2021 4:01 PM IST
వ‌ర్మతో జ్యోతి `త‌కిట త‌క‌ట‌ తందానా`!
X
కొద్దిరోజులుగా సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ పేరు మ‌ళ్లీ ఇంటా బ‌య‌టా మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ‌కి.. సోష‌ల్ మీడియా జ‌నాల‌కి ఇది అల‌వాటైన ప‌నే అయినా ఎప్పుడూ వివాదంలో ఫ్రెష్ ఫీల్ కోసం వ‌ర్మ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాడు కాబ‌ట్టి అది చ‌ర్చించుకోవాల్సిన అంశంగానే ఉంటుంది. `బిగ్ బాస్` ఫేం ఆరియానా బోల్డ్ ఎక్స్ ప్లోజివ్ ఇంట‌ర్వ్యూతో మొద‌లైన ర‌చ్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇటీవ‌లే సుల్తానా అనే అప్ క‌మింగ్ ఆర్టిస్ట్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో వ‌ర్మ చేసిన ర‌చ్చ అతా ఇంతా కాదు. మ‌ద్యం మ‌త్తులో ఏకంగా ఆ న‌టి కాళ్ల మీద ప‌డి పొర్లు దండాలే పెట్టేసారు. ఇద్ద‌రూ క‌లిసి వేసిన స్టెప్పులు అన్నిచోట్లా ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఆర్జీవీ మ‌త్తుతో ఊగే వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. ఇదే వీడియోలో తెలుగు న‌టి జ్యోతి కూడా ఉన్నారు. త‌న‌తో క‌లిసి వ‌ర్మ త‌న‌దైన శైలి స్టెప్పుల‌తో ఆక‌ట్టుకున్నారు. `సాగ‌ర సంగ‌మం` సినిమాలో `త‌కిట త‌కిట త‌దిమ‌ తందానా` అనే పాట‌కు వ‌ర్మ చెల‌రేగిపోయారు. దానికి సంబంధించిన వీడియోను నేరుగా జ్యోతి ఇన్ స్టాలో షేర్ చేసింది . దీనిపై ర‌క‌ర‌కాల కామెంట్లు వేడెక్కిస్తున్నాయి. ఆమెను తిడుతూ కొన్ని కామెంట్లు చేస్తుంస్తే.. ప్ర‌శంసిస్తూ మ‌రికొన్ని కామెంట్లు వ‌చ్చాయి. ఇంకొంద‌రు అయితే జ్యోతి చేసిన దాంట్లో త‌ప్పేం ఉంది? అంటూ సమ‌ర్థించారు. వ‌ర్మ నా ఇష్టం పుస్త‌కం త‌ర‌హాలో జ్యోతి ఏం చేసినా అది త‌న‌ ఇష్టం అని స‌మ‌ర్ధించారు... మీ వెంట మేమున్నాం .. రెచ్చిపోండి అంటూ ఫ‌న్నీగా మ‌ద్ద‌తిచ్చారు.

మొత్తానికి వ‌ర్మ పుట్టించిన కాక మామూలుగా లేదు. అయితే ఈసారి వ‌ర్మ‌పై మాత్రం అంత‌గా నెగివిటీ రాలేదు. బేసిక్ గా వ‌ర్మ స్వ‌భావం చాలా మందికి ఐడియా ఉంది కాబ‌ట్టి! అత‌ని జోలికి పెద్ద‌గా ఎవ‌రూ వెళ్ల‌లేదు. వ‌ర్మ‌తో ఆ వీడియోలో ఉన్న మిగ‌తా వారిపై త‌ప్ప వ‌ర్మ‌ని మాత్రం బుద్ధిమంతుడిగానే ట్రీట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. లాక్ డౌన్ ద‌గ్గ‌ర నుంచి వ‌ర్మ సినిమాలు కూడా చేయ‌లేదు. ఖాళీ స‌మ‌యాన్ని సోష‌ల్ మీడియాల‌కు మాత్ర‌మే కేటాయిస్తున్నారు. క‌థానాయిక‌లు యాంక‌ర్ల ప్ర‌మోష‌న్స్ కి వ‌ర్మ సాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆప్ఘ‌నిస్తాన్-తాలిబ‌న్ ల‌ వ్య‌వ‌హారం ప్ర‌పంచవ్యాప్తంగా హాట్ టాపిక్ కావ‌డంతో వ‌ర్మ కామెంట్లు డైలీ ఆ విష‌యంపైనే ఉంటున్నాయి. సామాన్యుల్లోనే కాదు మేధోవ‌ర్గాల్లోను వ‌ర్మ చిలిపిత‌నం నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.