Begin typing your search above and press return to search.

అనురాగ్ క‌శ్య‌ప్ చేసిన ప‌నికి ఎమోష‌న‌ల్ అయిన‌ ర‌జ‌నీ డైరెక్ట‌ర్!

By:  Tupaki Desk   |   29 Aug 2022 9:32 AM GMT
అనురాగ్ క‌శ్య‌ప్ చేసిన ప‌నికి ఎమోష‌న‌ల్ అయిన‌ ర‌జ‌నీ డైరెక్ట‌ర్!
X
త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ తో క‌బాలి, కాలా వంటి విభిన్న‌మైన మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌ని బ్యాక్ టు బ్యాక్ అందించి ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచారు ద‌ర్శ‌కుడు పా. రంజిత్‌. ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ ని సొంతం చేసుకోలేక‌పోయినా ద‌ర్శ‌కుడిగా మాత్రం పా. రంజిత్‌కు మంచి పేరుతో పాటు ఊహించ‌ని విధంగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇటీవ‌ల ఆర్య హీరోగా 'స‌ర్ప‌ట్ట ప‌రంప‌ర‌' తెర‌కెక్కించిన పా. రంజిత్ ప్ర‌స్తుతం విక్ర‌మ్ పీరియాడిక్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్‌) లో స్వాతంత్య్రానికి పూర్వం ఏం జ‌రిగింది? అనే క‌థాంశంతో ఈ మూవీని భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇటీవ‌లే ఈ మూవీని లాంఛ‌నంగా పూజా కార్యక్ర‌మాల‌తో ప్రారంభించారు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పై కె.ఇ. జ్ఞాన‌వేల్ రాజా ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్నారు. ఇదిలా వుంటే పా. రంజిత్ 'న‌చ్చ‌త్తిరం నాగ‌ర్ గిరాదు' అనే పేరుతో ఓ మూవీని రూపొందించాడు.

కాళిదాసు జ‌య‌రామ్‌, కాలై య‌ర‌స‌న్‌, దుశార విజ‌య‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. విఘ్నేష్ సుంద‌రేష‌న్‌, మ‌నోజ్ లియోనెల్ జాన్స‌న్ నిర్మించారు. రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఫిల్మ్ గా తెర‌కెక్కిన ఈ మూవీని ఆగ‌స్టు 31న విడుద‌ల చేస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ముంబైలో ప్ర‌త్యేకంగా సెల‌బ్రిటీల కోసం ప్రివ్యూ షోని ఆదివారం ఏర్పాటు చేశారు.

ఈ ప్రివ్యూకి చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యార‌ట‌. అయితే సినిమా చూసిన వాళ్ల‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ స్పందించిన తీరు ద‌ర్శ‌కుడు పా. రంజిత్ ని ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది. సినిమా చూసిన అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌కుడు పా. రంజిత్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించార‌ట‌.

అంతే కాకుండా ఆనందం ప‌ట్ట‌లేక పా. రంజిత్ ని అనురాగ్ హ‌గ్ చేసుకోవ‌డం విశేషం. సినిమా అద్భుతంగా వుంద‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడట‌. ప్ర‌స్తుతం అనురాగ్ క‌శ్య‌ప్ .. పా. రంజిత్ ని హ‌గ్ చేసుకుని అభినందిస్తున్న ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.