Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడి కొత్త సినిమా ప్రకటన!

By:  Tupaki Desk   |   28 May 2019 8:57 AM GMT
దర్శకేంద్రుడి కొత్త సినిమా ప్రకటన!
X
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గత కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన సుదీర్ఘమైన కెరీర్ లో 100 సినిమాలకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ఇలా రెండేళ్ళకు పైగా దర్శకత్వానికి గ్యాప్ ఇవ్వడం ఇదే మొదటిసారి. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున తో 2017 లో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన తన కొత్త సినిమాను ప్రకటించారు.

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాఘవేంద్ర రావు ట్విట్టర్ ద్వారా తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. "నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR అంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఇమేజ్ లో "ముగ్గురు డైరెక్టర్స్ తో.. ముగ్గురు హీరోయిన్లతో దర్శకేంద్రుడి సినిమా! హీరో ??" అనే క్యాప్షన్ ఉంది. ఈ సినిమా ప్రకటనతో రాఘవేంద్ర రావు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ రాఘవంద్ర రావు ఈ టిండర్.. టిక్ టాక్ జనరేషన్ ఆడియన్స్ ను మెప్పించగలడా లేదా అనేది వేచి చూడాలి.