Begin typing your search above and press return to search.

బాహుబలి కోసం మిస్ ఇండియా!!

By:  Tupaki Desk   |   2 Aug 2016 9:30 AM GMT
బాహుబలి కోసం మిస్ ఇండియా!!
X
యంగ్ రెబల్ స్టార్ కి జోడీగా అంటే.. హీరోయిన్ ఓ రేంజ్ లో ఉండాలని ఆలోచించడం సబబే. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత ఉండడంతో.. అసలు ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనే సందేహం అందరికీ ఉంది. అయితే మనోళ్లు మాత్రం హ్యాపీగా కొత్త రూటులో వెళ్తున్నారు.

ప్రభాస్ బాహుబలిని కంప్లీట్ చేస్తుండడంతో పాటే తర్వాతి మూవీకి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ లవ్ స్టోరీని ఫైనల్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్తమ్మాయిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 'స్టార్ హీరోయిన్ కంటే.. కొత్తమ్మాయిని తీసుకోవాలనే ఆలోచన ఉంది. అందరూ కొత్త హీరోయిన్ నే ప్రిఫర్ చేస్తుంది. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. కొన్నివారాల్లో హీరోయిన్ ని ఫైనల్ చేసి.. అనౌన్స్ చేస్తాం' అని చెప్పాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇప్పటికే పూరీ జగన్నాథ్ కాస్టింగ్ ఏజన్సీ నుంచి కొందరు అమ్మాయిలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మిస్ ఇండియా కంటెస్టెంట్ లను కూడా ప్రభాస్ కు జోడీగా నటింపచేసేందుకు చూస్తున్నారట. అయితే అన్ని రకాలుగాను జోడీ కుదిరాకే హీరోయిన్ ని ఫిక్స్ చేస్తామంటున్నాడు దర్శకుడు.

కళ్యాణ్‌ రామ్ కు మిస్ ఇండియా అదితి ఆర్యాను సెట్ చేసిన పూరి.. రాజ్ తరుణ్‌ కు అమైరా దస్తూర్ ను హీరోయిన్ గా మార్చిన ఛార్మి.. ఇప్పుడు ప్రభాస్ కోసం పిల్లను వెతికే పనిలో ఉన్నట్లు టాక్. చూద్దాం మరి ఆ బాహుబలికి ఎవర్ని సెట్ చేస్తారో.