Begin typing your search above and press return to search.

బెదిరిస్తే బ‌మ్స్ మీద‌ కొడతాన‌న్న‌ డైరెక్టర్

By:  Tupaki Desk   |   12 Jan 2022 5:36 AM GMT
బెదిరిస్తే బ‌మ్స్ మీద‌ కొడతాన‌న్న‌ డైరెక్టర్
X
సోష‌ల్ మీడియా యుగంలో త‌మ అభిమాన తార‌ల‌తో లేదా అభిమాన ద‌ర్శ‌కుల‌తో ముచ్చ‌టించేందుకు ప్ర‌తిదీ సులువుగా మారింది. అభిమానులు నేరుగా ఇన్ స్టా .. ఎఫ్.బి.. ట్విట్ట‌ర్ మాధ్య‌మాల్లో ఫేవ‌రెట్ల‌తో నేరుగా మంత‌నాలు సాగిస్తున్నారు. ప్ర‌భాస్ అభిమానులు ఈ విష‌యంలో చాలా జోరుమీద ఉంటున్నారు.

ఈ సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్ వాయిదా ప‌డ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం ప‌దే ప‌దే వాయిదా ప‌డుతుంటే ప్ర‌భాస్ అభిమానులు ద‌ర్శ‌క‌నిర్మాత‌లను సీరియ‌స్ గా నిల‌దీస్తున్నారు.

అయితే ఓ ప్ర‌శ్నోత్త‌రాల సెష‌న్ లో అభిమాని తీవ్ర‌మైన ప్ర‌శ్న‌కు అంతా షాక‌య్యారు. దానికి రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ట్వీట్ అంతే వేడెక్కించింది. ఇటీవ‌ల కేవ‌లం రాధేశ్యామ్ వర్కింగ్ స్టిల్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ని లాలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు రాధాకృష్ణ‌కుమార్. తాజా ప్ర‌శ్నోత్త‌రాల్లో ప్రభాస్ అభిమానిలో ఒక‌రు రాధాకృష్ణ‌ను బెదిరించారు. త‌న‌కు సమాధానం రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ``హలో అన్నా రీప్లే ఎవకపోతా సూసైడ్ లెటర్ రాసుకుంట`` అని రాశాడు. దానికి ప్రత్యుత్తరంగా ద‌ర్శ‌కుడు ఏమ‌న్నారంటే..``ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడతా`` అంటూ ఫన్నీగా స‌మాధాన‌మిచ్చారు. ఉత్త‌రం ప్ర‌త్యుత్త‌రం రెండూ ఫ‌న్నీగానే ఉన్నాయి. అన్న‌ట్టు రాధేశ్యామ్ కొత్త రిలీజ్ తేదీపై అయినా ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇస్తే బావుంటుంది.