Begin typing your search above and press return to search.

కాజల్ ది గ్రేట్‌ అంటున్న దర్శకుడు.. అబ్బో అంటున్న నెటిజన్స్‌

By:  Tupaki Desk   |   16 April 2021 5:30 AM GMT
కాజల్ ది గ్రేట్‌ అంటున్న దర్శకుడు.. అబ్బో అంటున్న నెటిజన్స్‌
X
కాజల్‌ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వచ్చింది. ఈమద్య కాలంలో ఈమె కమర్షియల్‌ సినిమాల కంటే లేడీ ఓరియంటెడ్‌ కథలకు ఎక్కువ ఓకే చెబుతోంది. స్టార్‌ హీరోలకు జోడీగా ఈమె ఆఫర్లు రాకపోవడంతో ఇలా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఓకే చెబుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ అమ్మడు చేస్తున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. అయినా కూడా వరుసగా సినిమాలను చేస్తూనే ఉంది. తాజాగా తమిళంలో ఈమె 'గోష్టి' అనే చిత్రాన్ని చేసింది.

పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ కాజల్‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపిస్తున్నట్లుగా ఫస్ట్‌ లుక్ ను బట్టి అర్థం అవుతోంది. తమిళ రాజకీయ నాయకుల పాత్రలను ఈ సినిమాలో చూపించబోతున్న నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సినిమా హర్రర్‌ బ్యాక్ డ్రాప్‌ అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి కాజల్‌ ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేట్లే ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసినట్లుగా దర్శకుడు ఎస్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు. దర్శకుడు మాట్లాడుతూ.. కథ వినగానే కాజల్ ఓకే చెప్పారు. సినిమాను జనవరిలోనే మొదలు పెట్టాం. ఇంత త్వరగా సినిమా పూర్తి అవ్వడానికి ప్రధాన కారణం కాజల్‌ మేడమ్‌. ఆమె మొదటి రోజు ఎలా ఎనర్జితో నటించారో చివరి రోజు వరకు అలాగే నటించారంటూ కాజల్‌ ను ఆకాశానికి ఎత్తాడు.

దర్శకుడు కళ్యాణ్‌ కాజల్‌ పై చేస్తున్న ప్రశంసలకు నెటిజన్స్ అబ్బో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్‌ ఏ సినిమాలో అయినా మంచి ఎనర్జితోనే నటిస్తుంది ఇందులో ప్రత్యేకంగా నువ్వు చెప్పేది ఏముంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాజల్‌ ను మోయడం ఆపి సినిమాను త్వరగా విడుదల చేయాలంటూ దర్శకుడు ఎస్ కళ్యాణ్‌ ను ఉద్దేశించి కొందరు అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.