Begin typing your search above and press return to search.

అలాంటి రోల్ చేస్తున్న బిచ్చగాడు

By:  Tupaki Desk   |   24 Sept 2016 11:14 AM IST
అలాంటి రోల్ చేస్తున్న బిచ్చగాడు
X
బిచ్చగాడు మూవీతో తెలుగులో భారీ సక్సెస్ అందుకున్న విజయ్ ఆంటోనీ.. తన నెక్ట్స్ పిక్చర్ ని తమిళ్ తోపాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు. కోలీవుడ్ లో సైతాన్ పేరుతో సిద్ధమవుతున్న ఈ మూవీ.. తెలుగులో బేతాళుడుగా విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో.. రకరకాల గెటప్ లలో ఉన్న విజయ్ ఆంటోనీ.. మూవీపై విపరీతమైన క్యూరియాసిటీ కలిగించాడు.

ట్రైలర్ చూస్తుంటేనే.. ఇదో టిపికల్ కేరక్టర్ అనే విషయం అర్ధమవుతుండగా.. రకరకాల గెటప్స్ తో కన్ ఫ్యూజ్ చేసేశాడు విజయ్ ఆంటోనీ. దాదాపు 2 నిమిషాల ట్రైలర్ ఇచ్చి కూడా.. స్టోరీకి సంబంధించి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా లీక్ చేయలేదంటే.. రచయిత-డైరెక్టర్ ప్రదీప్ కృష్ణమూర్తి ఎంత పకడ్బందీగా ఈ కథ రాసుకున్నాడో అర్ధమవుతుంది. అసలు తాను సినిమా డైరెక్షన్ చేసేద్దామని ఎప్పుడూ అనుకోలేదంటున్న ఈ దర్శకుడు.. బేతాళుడు కేరక్టర్ పై కొన్ని సీక్రెట్స్ గుట్టు విప్పేశాడు.

'బేతాళుడులో దినేష్ అనే సాఫ్ట్ వేర్ డెవలపర్ పాత్రను విజయ్ ఆంటోనీ పోషిస్తున్నాడు. ఇది స్కిజోఫ్రీనియాతో బాధపపడే వ్యక్తి స్టోరీ. అతని కోణంలోంచి.. అతని జీవితంలో ఎదురయ్యే సంఘటనలే బేతాళుడు. భార్యగా నటించిన అరుంధతి నాయర్ పాత్ర ఓ సమయంలో ఎంత ఇంపార్టెంట్ అయిపోతుందంటే.. ఆమె లేకపోతే ఈ సినిమా లేదని అనిపిస్తుంది' అంటూ మరింతగా ఆసక్తిని జనరేట్ చేశాడు దర్శకుడు ప్రదీప్.