Begin typing your search above and press return to search.

'వీరమల్లు' లోని సూపర్ స్టంట్ పై డైరెక్టర్ - బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   30 March 2021 8:30 AM GMT
వీరమల్లు లోని సూపర్ స్టంట్ పై డైరెక్టర్ - బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..!
X
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేష‌న్‌ లో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ''హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు''. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. 17వ శతాబ్దం కథతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ ఓ దొంగగా కనిపించునున్నాడు. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో అదిరే యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని శాంపిల్ గా చూపించారు. అయితే ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ 'వీరమల్లు' కోసం ఒక హై అండ్ సూపర్ స్టంట్ చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి అయిన శ్యామ్ కౌషల్ 'క్రిష్' 'ధూమ్ 3' 'క్రిష్ 3' 'దంగల్' 'బాజీరావ్ మస్తానీ' 'పద్మావత్' వంటి భారీ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. తెలుగులో తాజాగా కింగ్ నాగార్జున 'వైల్డ్‌ డాగ్' చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను కూడా శామ్ కౌశల్ డిజైన్ చేశారు. ఈ క్రమంలో పవన్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రానికి వర్క్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సులపై డైరెక్టర్ క్రిష్ తో తన అనుభవాలను శ్యామ్ కౌషల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీనిపై స్పందించిన క్రిష్.. ఇందులో హై అండ్ సూపర్ స్టంట్ కోసం పని చేస్తున్నట్లు తెలిపాడు. ఈ యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

కాగా, పవన్ కెరీర్ లో ఫస్ట్ పీరియాడికల్ మూవీ మరియ ఆయన కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేయబడిన సెట్స్ లో ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేశారు. ''హరి హర వీరమల్లు'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.