Begin typing your search above and press return to search.

కేటీఆర్ కి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడి ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   27 Nov 2018 3:08 PM GMT
కేటీఆర్ కి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడి ప్ర‌శ్న‌
X
గాంధీ ఆస్ప‌త్రి అంటేనే ప్ర‌జ‌ల‌కు ఎందుకు విర‌క్తి? ఇందుకు స‌మాధానం మ‌హాన‌టి ద‌ర్శ‌కుడి వ‌ద్ద ఉంది. ప్ర‌భుత్వాసుప‌త్రులు ప్ర‌జ‌ల‌కు ఎలా ప్రాణ సంక‌టంగా మారాయో ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్ష అనుభ‌వ‌మైంది. దీంతో ఏకంగా మంత్రి కేటీఆర్‌నే ప్ర‌శ్నిస్తూ సుదీర్ఘ లేఖ‌ను రాశారు. ఆ లేఖ‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు.

``ఆదివారం నాడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా మిత్రుడు మ‌ర‌ణించాడు. ప్రమాదం జరిగినప్పుడు చికిత్స కోసం హైద‌రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లిన‌ తర్వాత మూడు గంటల పాటు నా మిత్రుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో స్టాఫ్ ఎవ‌రూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి ఆస్ప‌త్రి అంతా తిరిగారు. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రిలో కాకుండా మరేదన్నా ఆస్పత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు. వైద్యం అందక చనిపోయిన నా మిత్రుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్‌. దీని గురించి నాకు ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకావడంలేదు సర్‌. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు.. అని ఆవేద‌న‌గా ఆ పోస్టులో పేర్కొన్నారు అశ్విన్‌.

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించి మనుషులు ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేం? ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్ప ండి కేటీఆర్‌ సర్‌... అంటూ ప్ర‌శ్నించారు.