Begin typing your search above and press return to search.
ఇకపై స్టూడియో నిర్మాణం సినిమాలపై ఎన్.శంకర్ దృష్టి
By: Tupaki Desk | 10 July 2023 3:30 AM ISTదర్శకుడు ఎన్.శంకర్ కు భూకేటాయింపుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసిన నేపథ్యంలో తలపెట్టిన టీవీ ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఎన్.శంకర్ కోర్టు తీర్పు అనంతరం చాలా సంతోషంగా ఉన్నారు.. పూర్తిగా ఉపశమనం పొందుతున్నారు! అని తెలిసింది.
నిజానికి ఎన్.శంకర్ కెరీర్ కొద్దికాలంగా స్థబ్ధుగా ఉంది. ఆయన దర్శకుడిగా సినిమాలేవీ చేయడం లేదు. టాలీవుడ్ లో జయం మనదేరా -శ్రీరాములయ్య-భద్రాచలం-జై బోలో తెలంగాణ వంటి కష్టతరమైన స్ఫూర్తివంతమైన సినిమాలను తెరకెక్కించిన ఎన్.శంకర్ తనదైన బ్రాండ్ సినిమాలతో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. బాక్సాఫీస్ విజయంతో పాటు సామాజికంగా ఆలోచనలను రేకెత్తించే సినిమాలతో చాలా పేరు ఆదరాభిమానాలను సంపాదించాడు. అతడు తన కెరీర్ లో సూపర్ స్టార్ కృష్ణ- మోహన్ బాబు- వెంకటేష్- శ్రీహరి- నితిన్ వంటి పెద్ద స్టార్ లతో కలిసి పనిచేశాడు.
ఓటీటీ వేదికలతో బిగ్ ప్లానింగ్:
ఇటీవల OTTల క్రేజ్ పెరగడంతో ఇప్పటికే ఎన్.శంకర్ ఇప్పటికే నాలుగైదు స్క్రిప్ట్ లను సిద్ధం చేసుకున్నారు. పలు థ్రిల్లింగ్ వెబ్ సినిమాలను తెరకెక్కించడానికి పాపులర్ కార్పొరేట్ హౌస్ తో టై అప్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరోవైపు ఫిలిం స్టూడియో కోసం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో అత్యాధునిక స్టూడియోని నిర్మించడంపై ఎన్.శంకర్ పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు. ఇప్పటికే ఉన్న సదుపాయాలతో ఒక సొగసైన స్టూడియోను అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రద్ద పెట్టనున్నాడని తెలుస్తోంది.