Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ హీరో.. పండగ డైరెక్టర్ కాంబో?

By:  Tupaki Desk   |   24 Dec 2019 5:30 PM GMT
ఇస్మార్ట్ హీరో.. పండగ డైరెక్టర్ కాంబో?
X
కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు మారుతి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డీసెంట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర నిలకడగా కలెక్షన్స్ వసూలు చేస్తోంది. హిట్ దిశగా పయనిస్తోంది. దీంతో ఒక్కసారిగా మారుతి నెక్స్ట్ ప్రాజెక్టులపై అందరికీ ఆసక్తి పెరిగింది.

ఈ సినిమా తర్వాత మారుతి నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమా తర్వాత మారుతి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. రామ్ స్టైల్ కు తగ్గట్టు ఒక కామెడీ-యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ తయారికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇస్మార్ట్ హీరో - మారుతి కాంబినేషన్ తప్పకుండా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేదే. మారుతికి ఇప్పటికే ముగ్గురు నిర్మాతలు ఎడ్వాన్సులు ఇచ్చి ఉన్నారట. వీరిలో ఎవరు రామ్ సినిమా సెట్ చేస్తే వారితో ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారట. ఆ ముగ్గురిలో దిల్ రాజు.. మ్యాట్నీ ఎంటర్ ప్రైజెస్.. మంజుల ఘట్టమనేని ఉన్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.