Begin typing your search above and press return to search.

బి అంటే బంగారమేనా??

By:  Tupaki Desk   |   8 May 2017 6:45 AM GMT
బి అంటే బంగారమేనా??
X
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ లకు కొదవేం ఉండదు. నాటి తరం దర్శకుల నుంచి నేటితరం దర్శకుల వరకు ఇందుకూ ఎవరూ మినహాయింపు కాదు. సెంటిమెంట్ పాటిస్తే తమకు కలిసొస్తుందని నమ్ముతారు. కొన్నిసార్లు వీరి అంచనాలు బోల్తా కొట్టినా సెంటిమెంట్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తాజాగా ఇలాంటి దర్శకుల జాబితాలో భలేభలే మగాడివోయ్ దర్శకుడు మారుతి కూడా చేరిపోయాడు.

ఈ రోజుల్లో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మారుతి ప్రేమకథాచిత్రమ్ తో బాగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. మతిమరుపుతో తంటాలు పడే వ్యక్తి కథతో నానీ హీరోగా రూపొందించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా మారుతికి మంచిపేరు తెచ్చిపెట్టింది. సునిశిత హాస్యంతో మారుతి తీసిన ఈ సినిమా అన్నివర్గాలను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం మారుతికి ‘బి’ కలిసొస్తుందనే నమ్మకం పెంచినట్లుంది. అందుకే తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన బాబు బంగారం సినిమా టైటిల్ లో ఇదే సెంటిమెంట్ ఫాలో అయిపోయాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అయినా కూడా మారుతి ‘బి’ సెంటిమెంట్ ను వదల్లేదు.

మారుతి తను తీస్తున్న సినిమాలకే కాదు.. స్ర్కిప్ట్, మాటలు అందించే సినిమాలకూ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా చిన్నికృష్ణ దర్శకత్వంలో తెలుగమ్మాయి స్వాతి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి ‘లండన్ బాబులు’ టైటిల్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు శర్వానంద్ హీరోగా ‘మహానుభావులు’ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. చూద్దాం.. ఈ సెంటిమెంట్లలో ఏది వర్కవుటవుతుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/