Begin typing your search above and press return to search.

మారుతి ఈ టెస్ట్ పాసైతే ఇక నెక్స్ట్ లెవెల్ కే

By:  Tupaki Desk   |   15 Jun 2022 11:30 PM GMT
మారుతి ఈ టెస్ట్ పాసైతే ఇక నెక్స్ట్ లెవెల్ కే
X
సున్నిత‌మైన భావోద్వేగాల‌కు త‌న‌దైన మార్కు అంశాల‌ని జోడించి స‌రికొత్త సినిమాల‌ని తెర‌పైకి తీసుకొస్తుంటారు దర్శ‌కుడు మారుతి. `శైల‌జారెడ్డ అల్లుడు` ఆశించిన స‌క్సెస్ ని అందించ‌క‌పోవ‌డంతో కొంత నిరుత్సాహ ప‌రిచిన మారుతి చావు కూడా పండ‌గే అంటూ `ప్ర‌తిరోజు పండ‌గే` మూవీతో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. అయితే కోవిడ్ నేపథ్యంలో సంతోష్ శోభ‌న్ హీరోగా ఆయ‌న చేసిన మూవీ `మంచిరోజులొచ్చాయి` పెద్ద‌గా పేల‌లేదు.

దీంతో మ‌ళ్లీ ఆయ‌న‌కు సూప‌ర్ హిట్ కావాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం మారుతి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`. హీరోగా గోపీచంద్ న‌టించారు. రాశీఖ‌న్నా హీరోయిన్. జీఏ2 పిక్చ‌ర్స్ , యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ల‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి మూవీపైనే వుంది. జూలై 1న ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. సినిమాపై బ‌జ్ ని క్రేజ్ చేసింది. ట్రైల‌ర్ లో హీరో గోపీచంద్ ప‌లికిన సంభాష‌ణ‌లు, రాశీఖ‌న్నాతో కుదిరిని కెమిస్ట్రీ.. గోపీచంద్.. స‌త్య‌రాజ్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమా సూప‌ర్ హిట్ గ్యారెంటీ అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే ఈ మూవీ ద‌ర్శ‌కుడు మారుతికి, అత‌ని కెరీర్ కి బిగ్ టెస్ట్ అని తెలుస్తోంది.

కార‌ణం ఇప్ప‌టి వ‌రకు మారుతి బిగ్ స్టార్స్ లైక్ వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌ల‌తో చేసిన సినిమాలేవి పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో అత‌నికి పెద్ద స్టార్స్ ఎవ‌రు సినిమాలు ఇవ్వ‌లేదు. ఇటీవ‌ల ప్ర‌భాస్ తో సినిమా అని హ‌డావిడి చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ న్యూస్ బ‌య‌టికి రాలేదు. బ‌న్నీతో కూడా మారుతి సినిమా చేయాల‌ని చాలా సార్లు ట్రై చేశాడు కానీ ప్రాజెక్ట్ ని మాత్రం క‌న్ఫ‌ర్మ్ చేసుకోలేక‌పోయాడు. ఈ నేప‌థ్యంలో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` హీరో గోపీచంద్‌కు , ద‌ర్శ‌కుడు మారుతికి బిగ్ టెస్ట్ గా మారింది.

ఈ మూవీ సూప‌ర్ స‌క్సెస్ అయితే ప్ర‌భాస్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఒక‌వేళ మిస్ ఫైర్ అయితే ప్ర‌భాస్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. దీంతో మారుతికి బిగ్ స్టార్ తో సినిమా చేసే అవ‌కాశం మిస్స‌వుతుంది. అందుకే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` స‌క్సెస్ ఇప్ప‌డు మారుతికి అనివార్యంగా మారిందని అంటున్నారు.

ఇప్ప‌టికే మంచి బ‌జ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఖ‌చ్చితంగా మారుతిని గ‌ట్టెక్కించ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ మూవీలో స‌త్య‌రాజ్‌, రావు ర‌మేష్‌, అన‌సూయ‌, అజ‌య్ ఘోష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.