Begin typing your search above and press return to search.

'సర్కారు'లో డైరెక్టర్ మార్క్ హైలైట్స్..?

By:  Tupaki Desk   |   27 April 2021 6:30 AM GMT
సర్కారులో డైరెక్టర్ మార్క్ హైలైట్స్..?
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఎప్పటికప్పుడు సర్కార్ పాట గురించి ప్రేక్షకులకు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కామెడీ సన్నివేశాలు ఓ రేంజిలో అలరించనున్నట్లు టాక్. ప్రతి సినిమాలో డైరెక్టర్ పరశురామ్ తను మార్క్ కామెడీతో ఆకట్టుకుంటారు. ఈసారి సర్కారులో కూడా కమెడియన్స్ సప్తగిరి, ప్రియదర్శి అనసూయ కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్ లో హిల్లేరియస్ గా ఉండబోతుందని టాక్.

ఈ సినిమాలో మహేష్ బాబు మాంచి సరదా క్యారెక్టర్ లో కనిపించనున్నాడట. భారీ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ బ్యాంకు ఎంప్లాయిగా కనిపిస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన రంగ్ దే బ్యూటీ కీర్తిసురేష్ నటిస్తోంది. అసలే అమ్మాయిలకు ప్రిన్స్ అయినటువంటి మహేష్ జోడిగా కుర్రాళ్లకు ఫేవరేట్ అయిన కీర్తి అనేసరికి ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14ప్లస్ రీల్స్ వారితో పాటుగా మహేష్ బాబు కూడా నిర్మిస్తున్నాడు. తమన్ నాలుగోసారి మహేష్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.