Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌ : ఆసుపత్రికి స్టార్‌ డైరెక్టర్ మణిరత్నం

By:  Tupaki Desk   |   19 July 2022 10:06 AM GMT
బ్రేకింగ్‌ : ఆసుపత్రికి స్టార్‌ డైరెక్టర్ మణిరత్నం
X
రెండున్నర సంవత్సరాలుగా కరోనా కారణంగా ఎంతో మంది సెలబ్రెటీలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మెజారిటీ సెలబ్రెటీలు ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. కాని కొందరు మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అందుకే సెలబ్రెటీలు ముఖ్యంగా స్టార్స్ ఎవరైనా కరోనా బారిన పడితే వారి అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు.

కరోనా బాధితుల జాబితాలో సౌత్‌ లెజెండ్రీ డైరెక్టర్‌ మణిరత్నం చేరారు. ఆయన కరోనా లక్షణాలతో చైన్నైలోని ప్రముఖ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారనే వార్తలు ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. స్వల్ప లక్షణాలతోనే మణిరత్నం ను ఆసుపత్రిలో జాయిన్‌ చేసినట్లుగా కుటుంబ సభ్యులు మరియు వారి సన్నిహితులు చెబుతున్నారు.

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా సెప్టెంబర్ 30న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ఒక వైపు చూసుకోవడంతో పాటు చివరి దశ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ లో మణిరత్నం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన కరోనా బారిన పడ్డారనే వార్తలు వస్తున్నాయి.

కరోనా కొత్త వేవ్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రెటీలు మళ్లీ ఆసుపత్రి పాలవుతున్నారు. మణిరత్నం కు స్వల్ప లక్షణాలే ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే కుటుంబ సభ్యులు అంటున్నారు. కాస్త అభిమానులు ఊపిరి పీల్చు కుంటున్నారు. అయినా కూడా అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.

మణిరత్నం ఆరోగ్యం విషయమై ఆసుపత్రి నుండి సాయంత్రం వరకు ప్రెస్ నోట్‌ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రెస్‌ నోట్‌ విడుదల తో మొత్తం వాతావరణం కూల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన వెంటనే కోలుకుని పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కోరుకుంటున్నారు.