Begin typing your search above and press return to search.

ఆర్జీవీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం తప్పే కదా...!

By:  Tupaki Desk   |   16 Aug 2020 3:00 PM IST
ఆర్జీవీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం తప్పే కదా...!
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చర్యలు ఊహాతీతం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూవీ మేకర్స్ అందరూ కరోనా కి బయపడి ఇంట్లో నుండి బయటకి రావడానికి కూడా ఆలోచిస్తుంటే ఆర్జీవీ మాత్రం వరుస పెట్టి సినిమాలు తీసేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే 'క్లైమాక్స్' 'నగ్నం' 'పవర్ స్టార్' సినిమాలు రిలీజ్ చేసిన వర్మ లేటెస్టుగా 'నగ్నం 2' అంటూ ''థ్రిల్లర్'' అనే సినిమా రిలీజ్ చేశాడు. ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్రైలర్.. హీరోయిన్ అప్సర రాణి హాట్ ఫొటోలతో ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చాడు. అయితే వీటిని చూసి 'థ్రిల్లర్' సినిమా చూసిన ఆడియన్స్.. వర్మని నమ్మి మరోసారి మోసపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా 'థ్రిల్లర్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాలో ఏదో ఉందని పబ్లిసిటీ చేయడంతో.. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో 'థ్రిల్లర్' మూవీకి రూ. 200 టికెట్ ధర పెట్టిన వర్మ 22 నిమిషాల షార్ట్ ఫిలిం చూపించేసాడు. టీజర్ ట్రైలర్ లో ఫ్రీగా ఏమి చూపించాడో.. సినిమాలో మళ్ళీ వాటినే డబ్బులు తీసుకుని చూపించాడని 'థ్రిల్లర్' ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఆర్జీవీ నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించడం మన తప్పే అని.. 'నగ్నం' ని మించి 'నగ్నం 2'లో ఏదో ఉంటుందనుకోవడం మన పొరపాటే అని రియలైజ్ అవుతున్నారట.

అంతేకాకుండా డైరెక్టర్స్ అందరూ వెబ్ సిరీస్ లేని.. న్యూ జోనర్ సినిమాలు అని ప్రయోగాలు చేస్తున్న సమయంలో.. వర్మ ఒకప్పటి క్రియేటివిటీ వదిలేసి షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. మరి వర్మ తీయబోయే నెక్స్ట్ సినిమాకు దూరంగా ఉంటారా అంటే.. అది చెప్పలేం. ఎందుకంటే ఆయన చేతిలో ఎన్నిసార్లు మోసపోవడానికైనా ఓ వర్గం ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. మరి వర్మ ఒక్క మంచి సినిమా అయినా తీసి వారి ఎక్సపెక్టేషన్స్ రీచ్ అవుతాడేమో చూడాలి.