Begin typing your search above and press return to search.
డైరెక్టర్ ఆ సీన్ కోసం ఫుల్లుగా తాగించాడు
By: Tupaki Desk | 2 April 2021 6:00 AM ISTఇండస్ట్రీలో ఇరవైఏళ్లకు పైగా అనుభవం కలిగిన హీరోలు చాలామంది ఉన్నారు. అందులో కొందరు ఇంకా హీరోలుగా కొనసాగుతున్నారు. మరికొందరు సైడ్ క్యారెక్టర్స్, ఫాదర్ రోల్స్ లాంటివి చేస్తూ సర్వైవ్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు హీరో శ్రీరామ్.. తెలుగువారు శ్రీకాంత్ అని కూడా పిలుస్తుంటారు. ఐతే 2002లో రోజాపూలు సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. తెలుగులో కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ తెలుగుకంటే కూడా తమిళంలోనే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఐతే కెరీర్ ప్రారంభంలో హీరోగా సినిమాలు చేసాడు కానీ రానురాను అవకాశాలు నెమ్మదించడంతో సైడ్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టాడు. ఆ విధంగానే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నంబన్ సినిమాలలో ఫ్రెండ్ రోల్స్ పోషించాడు. చాలకాలం తర్వాత శ్రీకాంత్ తెలుగులో సినిమా చేసాడు.
ఐతే ఈ సినిమాలో ఇద్దరు ప్రధాన నటులుగా నటించారు. శ్రీరామ్ తో పాటు రాహుల్ రామకృష్ణ నటించాడు. 'వై' అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ.. ఏప్రిల్ 2న ఆహా ఓటిటిలో విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా మేకర్స్, చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా గురించి శ్రీరామ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.'రోజాపూలు సినిమా చేసి ఇన్నేళ్లు గడిచిందంటే నమ్మలేకపోతున్నాను. లాక్ డౌన్ తర్వాత చాలా రోజులకు ఆహా లాంటి మంచి ప్లాట్ ఫామ్ లభించింది. నా లైఫ్ లో తక్కువ రోజుల్లో ఫినిష్ చేసిన సినిమా ఇదే. ఇంత ఫాస్ట్ గా తీయొచ్చని ఈ మద్యే అర్ధమైంది. ఈ సినిమాలో రాహుల్ తో ఓ సీన్ విషయంలో భయపడ్డాను. పీకలదాకా విస్కీ తాగించి సీన్ చేయించుకున్నాడు. ఆయన్ని చూస్తే అమాయకంగా కనిపిస్తాడు కానీ అంత అమాయకుడు కాదు. చాలా క్లీన్ గా సినిమా తీసాడు. థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి" అని చెప్పాడు. ఈ సినిమాకు బాలు ఆడుసుమిల్లి దర్శకత్వం వహించాడు.