Begin typing your search above and press return to search.

'యాత్ర' మేకర్‌ కర్తవ్యంను మళ్లీ తీసుకు రాబోతున్నాడా..!

By:  Tupaki Desk   |   20 Jun 2022 2:30 AM GMT
యాత్ర మేకర్‌ కర్తవ్యంను మళ్లీ తీసుకు రాబోతున్నాడా..!
X
విలేజ్ లో వినాయకుడు సినిమా తో నిర్మాతగా టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన మహి వి రాఘవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చేసిన ఛారిత్రాత్మక పాద యాత్ర నేపథ్యంలో 'యాత్ర' అనే సినిమాను చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. యాత్ర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మహి వి రాఘవ గురించి ప్రముఖ చర్చ జరిగింది.

యాత్ర తర్వాత దర్శకుడిగా మహి వి రాఘవ నుండి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మద్య యాత్ర 2 అంటూ కాస్త హడావుడి సాగింది. జగన్ మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఏర్పాటు మరియు పాదయాత్ర ఇతర విషయాల గురించి యాత్ర 2 ను తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఆ ప్రాజెక్ట్‌ ప్రస్తుతానికి పక్కకు పెట్టిన దర్శకుడు మహి వి రాఘవ తాజాగా ఒక కొత్త సినిమా ను లైన్ లో పెట్టాడని తెలుస్తోంది. మూడు సంవత్సరాల క్రితం నయనతార హీరోయిన్‌ గా తమిళంలో రూపొందిన ఒక సినిమా తెలుగు లో కర్తవ్యం అనే టైటిల్ తో వచ్చింది.ఆ సినిమా కథ మొత్తం బోర్‌ వెల్‌ లో పడ్డ ఒక చిన్నారి గురించిన ఇష్యూ చుట్టు తిరుగుతుంది.

ఇప్పుడు అచ్చు అలాంటి కథతోనే మహి వి రాఘవ ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ కూడా ముగించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీగా ఉన్నాడట. కర్తవ్యం సినిమా తెలుగు లో విడుదల అయినా కూడా పెద్దగా జనాలు చూడలేదు. పైగా కర్తవ్యం సినిమా యొక్క నేపథ్యం ఈ నేపథ్యం సేమ్‌ అయినా కూడా కథ మరియు స్క్రీన్‌ ప్లే పూర్తి విభిన్నంగా ఉంటుందట.

కనుక తెలుగు లో ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మహి వి రాఘవ విలక్షణ కథలను మరియు విభిన్నమైన స్క్రిప్ట్‌ లను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు. కనుక ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.