Begin typing your search above and press return to search.

విజయ్ - చరణ్ సినిమాలపై లోకేష్ కనగరాజ్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   22 Jun 2022 5:30 AM GMT
విజయ్ - చరణ్ సినిమాలపై లోకేష్ కనగరాజ్ క్లారిటీ..!
X
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ పేరు సంచలనంగా మారింది. 'మా నగరం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్.. 'ఖైదీ' చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 'మాస్టర్' మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. లేటెస్టుగా ''విక్రమ్'' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ళతో కోలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్ నమోదు చేసింది.

ఇప్పటికే 'విక్రమ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీంతో ఇప్పుడు కమల్ హాసన్ తో పాటుగా తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు మారుమోగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించే మాట్లాడుకుంటున్నారు.

హాలీవుడ్ లో మార్వెల్ కామిక్ యూనివర్స్ - డీసీ ఎక్స్టెండెట్ యూనివర్స్ తరహాలో.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టించాడు. 1980స్ లో వచ్చిన 'ఏజెంట్ విక్రమ్' సినిమాలోని కమల్ పాత్రను కొనసాగిస్తూ.. ‘ఖైదీ’ చిత్రంలోని క్యారెక్టర్స్ ను లింక్ చేస్తూ ''విక్రమ్'' మూవీతో ఓ కొత్త ప్రయత్నం చేసాడు. ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని పంచాడు లోకేష్.

అంతేకాదు 'ఖైదీ 2' 'విక్రమ్ 3' లకు లీడ్ వదిలి అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసాడు. ఇలాంటి ప్రయత్నం చేసిన తొలి సౌత్ ఇండియన్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కావడం విశేషం. టాలెంటెడ్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేయనున్నట్లు ఇప్పటికే ధ్రువీకరించారు.

'దళపతి 67' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైతం LCUలో ఓ భాగమని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ లోకేశ్ కనగరాజ్ ఈ రూమర్స్ పై స్పందించాడు.

Thalapathy67 స్పెషల్ మూవీగా ఉంటుందా లేక LCUలో భాగమవుతుందా అనేది త్వరలో తెలియజేస్తానని.. ప్రస్తుతానికైతే దీన్ని ఓ ఇంటెన్స్ యాక్షన్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నానని లోకేష్ తెలిపారు. ఈ స్క్రిప్ట్ తన హృదయానికి హత్తుకుందని చెప్పారు.

ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం లోకేశ్ ఒక బైలింగ్విల్ స్క్రిప్ట్ తో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను సంప్రదించాడని.. ఈ ప్రాజెక్ట్ దాదాపు సెట్ చేయబడిందని వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఈ నేపథ్యంలో లోకేష్ మాట్లాడుతూ.. చరణ్ తనకు అత్యంత సన్నిహితుడని.. ఆయనను చాలాసార్లు కలిశానని తెలిపారు. కానీ ఇద్దరి మధ్య ఏ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించలేదని లోకేష్ ఇంటర్వ్యూలో వెల్లడించారని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి.