Begin typing your search above and press return to search.

రామ్ సినిమాలో పవన్ అత్త.. లుక్ రివీల్ చేసిన డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   14 July 2021 11:30 AM GMT
రామ్ సినిమాలో పవన్ అత్త.. లుక్ రివీల్ చేసిన డైరెక్టర్..!
X
'ఉస్తాద్' రామ్ పోతినేని - తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో కంప్లీట్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌ గా ఈ బైలింగ్విల్ ని రూపొందించనున్నారు. #RAPO19 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ప్రస్తుతం హీరో రామ్ తో పాటుగా ఇతర ప్రధాన పాత్రలు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సెట్స్ లో రామ్ కు సంబంధించిన ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో దర్శకుడు లింగుస్వామి ఇన్స్టాగ్రామ్ వేదికగా సీనియర్ నటి నదియా లుక్ ని రివీల్ చేశారు.

#RAPO19 నుంచి బయటకు వచ్చిన ఫొటోలో నదియా పసుపు చీరలో కళ్ళద్దాలు ధరించి హుందాగా కన్పిస్తోంది. ఇందులో ఆమె క్యారక్టర్ కు సంబంధించిన వివరాలేవే చిత్ర బృందం వెల్లడించనప్పటికీ.. నదియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థం అవుతోంది. అంతేకాదు అది రామ్ తల్లి పాత్ర అని కూడా అంటున్నారు. ప్రస్తుతం రామ్ తో పాటుగా నదియా కూడా షూట్ లో పాల్గొంటోంది. 'మిర్చి' సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన నదియా.. 'అత్తారింటికి దారేది' 'దృశ్యం' 'బ్రూస్లీ' 'అ ఆ' 'నా పేరు సూర్య' 'మిస్ ఇండియా' వంటి చిత్రాల్లో అలరించింది. ప్రస్తుతం 'గని' 'వరుడు కావలెను' చిత్రాల్లో నటిస్తున్న నదియా.. ఇటీవలే 'దృశ్యం 2' షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చిత్రంలో నటిస్తున్నారు.

కాగా, #RAPO19 చిత్రానికి ''ఉస్తాద్'' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో రామ్ సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు. 'దృశ్యం' 'లూసిఫర్' చిత్రాల సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి అన్బు-అరివు ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.