Begin typing your search above and press return to search.

దాసరి మరణంపై క్రిష్ కదిలించేశాడు..

By:  Tupaki Desk   |   31 May 2017 10:46 AM IST
దాసరి మరణంపై క్రిష్ కదిలించేశాడు..
X
దాసరి మరణంపై తెలుగు సినీ పరిశ్రమ కదిలిపోయింది. సినీ ప్రముఖులందరూ ఆయనకు ఘన నివాళి ఇచ్చారు. దాసరి గురించి గొప్పగా మాట్లాడారు. ఎవరి స్థాయిలో వాళ్లు దాసరి ఘనతల గురించి స్పందించారు. ఐతే దర్శకుడు క్రిష్ దాసరి గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఒక మెసేజ్ అందరినీ కదిలించేసింది. దాసరి గొప్పదనాన్ని చాలా తక్కువ మాటల్లో అద్భుతంగా చెప్పాడు క్రిష్. నిన్న రాత్రి నుంచి క్రిష్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాసరికి ఇంతకంటే గొప్ప నివాళి ఉండదని అంటున్నారు అందరూ. ఇంతకీ క్రిష్ దాసరి గురించి ఏమని రాశాడంటే..

‘‘గుండె ఆడకపోతే ఏం?.. దాసరి గారి సినిమా ఆడుతూనే ఉంటుందిగా.. థియేటర్లలోనో.. టీవీ ఛానెళ్లలోనో.. తాతా మనవడు నుంచి నూట యాభై ఒక్క సినిమాలున్నాయి.. ఆడుతూనే ఉంటాయి. భూమ్మీద సినిమా అనేది లేనప్పుడు దాసరి గారు లేరనాలి.. అది జరగదు కదా.

దాసరి గారంటే 74 ఏళ్లు నిండిన వ్యక్తి కాదు. 24 శాఖలు కలిసిన శక్తి. ఇలాంటి వారికి జయజయ ద్వానాలు ఉంటాయి. కానీ జోహార్లు ఉండవు. దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎక్కడ ఎవరంటున్నా దాసరి గారు వింటారు. ఏ తెలుగు దర్శకుడికి గౌరవం దక్కినా అందులో దాసరి గారు ఉంటారు.

పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారు.. లేరనకండి వింటారు..’’
-క్రిష్ జాగర్లమూడి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/