Begin typing your search above and press return to search.

ఈ అవార్డు ఆ వందకు చేయూతా?

By:  Tupaki Desk   |   30 March 2016 5:29 AM GMT
ఈ అవార్డు ఆ వందకు చేయూతా?
X
జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి నిలిచి ఎందరో తెలుగువారికి ఆనందానికి, ఆదర్శానికి కారణమయ్యింది. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన కంచె కూడా ప్రేక్షకుల మన్ననలను అందుకున్న చిత్రమే. పరిమిత బడ్జెట్ లో తక్కువ రోజుల్లో కంచె లాంటి సినిమా తీయడం అబ్బురపరిచే విషయమే. ఈ ఘనత సాధించిన దర్శకుడు క్రిష్ ఈ వార్త ద్వారా ఆనందంలో మునిగితేలుతున్నట్టు సమాచారం.

అయితే ఈ అవార్డు ఇప్పుడు తాను చేయనున్న బాలయ్య 100వ సినిమాకు ఎంతో దోహదపడనుంది. అటు బాలయ్యకి క్రిష్ పై పూర్తి నమ్మకం కుదరడమేకాక ఇటు క్రిష్ కూడా నుతనోత్తేజంతో ఈ ప్రాజెక్ట్ కోసం మరింత కష్టపడే అవకాశం వుంది.

బాలయ్య వండవ సినిమా కోసం క్రిష్ గౌతమీ పుత్రా శాతకర్ణి సబ్జెక్ట్ ని ఎంచుకున్న సంగతి తెలిసినదే. 3వ శతాబ్దంలో అమరావతిని పాలించిన ఈ రాజుకి ఘనమైన చరిత్రే వుంది. ఈ ప్రాజెక్ట్ కి యోధుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకోసం బాలయ్య కొత్తరకం మీసకట్టు కోసం కసరత్తుచేస్తున్నారు