Begin typing your search above and press return to search.

కొర‌టాల‌.. మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందా?

By:  Tupaki Desk   |   27 April 2022 8:00 AM IST
కొర‌టాల‌.. మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందా?
X
ఇండ‌స్ట్రీలో వున్న టాప్ డైరెక్ట‌ర్ ల‌లో స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ శైలి ప్ర‌త్యేకం. అంతా త‌మ‌కు న‌చ్చిన పంథాలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తుంటే కొర‌టాల శివ మాత్రం త‌ను న‌మ్మిన అభ్యుద‌య భావాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని జోడించి వెండితెర‌పై స‌రికొత్త క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టారు. వామ ప‌క్ష భావ‌జాలం వున్న ఆయ‌న తొలి చిత్రం `మిర్చి` నుంచి త‌న సినిమాల్లో ఏదో ఒక సామాజిక అంశాన్ని చ‌ర్చిస్తూ తెర‌పై అద్భుత‌మైన విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఆయ‌న ఇంత వ‌ర‌కు చేసిన ప్ర‌తీ సినిమా ఓ బ్లాక్ బ‌స్ట‌రే.

ఇండ‌స్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్లు వున్నా వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకున్న ట్రాక్ రికార్డ్ కొర‌టాల శివ సొంతం. ప్ర‌భాస్ తో చేసిన `మిర్చి`, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేసిన `శ్రీ‌మంతుడు`, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో తెర‌కెక్కించిన `జ‌న‌తా డ్యారేజ్‌`, మ‌హేష్ హీరోగా న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` వంటి చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ కొర‌టాల శివ‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించారు. పాన్ ఇండియా స్థాయిలో ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న రాజ‌మౌళి కెరీర్ లో హిట్ లు , సూప‌ర్ హిట్ లు యావ‌రేజ్ సినిమాలు, పాన్ ఇండియా స్థాయి హిట్ లు వున్నా కొర‌టాల కెరీర్ లో మాత్రం వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు వుండ‌టం విశేషం.

ఇంత వ‌ర‌కు అప‌జ‌య‌మెరుగ‌ని స్టార్ డైరెక్ట‌ర్ గా స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకున్నారు కొర‌టాల శివ‌. ఇంత వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాలు ఆయన పంథాలో రూపొంది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు గా నిలిచాయి. అయితే ఇప్ప‌డు ఆయ‌న క‌న్విక్ష‌న్ కి డెడికేష‌న్ కి మెగా హీరోలు తోడ‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆచార్య‌`. చిరు నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా ఇది.

అంతే కాకుండా కొర‌టాల శివ నుంచి దాదాపు నాలుగేళ్ల అనంత‌రం వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలున్నాయి. అయితే కొర‌టాల తో మెగా హీరోలు క‌లిసారు కాబ‌ట్టి కొంత లో కొంత వ‌ర‌కు ద‌ర్శ‌కుడిగా ఆయ‌నకు ఫ్రీడం ఇచ్చారా? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ఫ్ంరీడ‌మ్ ఇస్తే క‌న‌క ఆయ‌న మార్కుకి మెగా ప‌వ‌ర్ తోడై సినిమా నెక్స్ట్ లెవెల్ లో వ‌చ్చి వుంటుంద‌న్న‌ది ఇన్ సైడ్ టాక్ . అయితే కొర‌టాల‌కు ఫ్రీడం ఇచ్చారా? అన్న‌ది ఇక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది.

ఫ్యాన్స్ లెక్క‌లు వుంటాయి కాబ‌ట్టి మెగా వారు కొంత వ‌ర‌కు ఈ మూవీలో ఇన్ వాల్వ్ అయి వుంటారు. అలా అయినా కూడా సినిమా మెగా హ్యాండ్ తోడ‌వ్వ‌డంతో పాన్ ఇండియా వైడ్ హిట్ అవుద్దా. మెగా కెలుకుడు ఎక్కువైతే కొర‌టాల మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అనే చ‌ర్చ అభిమానుల్లో జ‌రుగుతోంది. అంతే కాకుండా సాధార‌ణంగా కొర‌టాల వే లో చేసి వుంటే `ఆచార్య‌` డామ్ ష్యూర్ గా బ్లాక్ బ‌స్ట‌రే. కానీ ఆయ‌న‌కు ఫ్రీడ‌మ్ ఇవ్వ‌క‌పోతే ఇక్క‌డ ఇబ్బంది అంటున్నారు. ఈ నేప‌థ్యంలో మెగా వారు ఎక్కువ‌గా ఇన్ వాల్వ్ అయి వుంటే `ఆచార్య‌` మెగా - కొర‌టాల క‌ల‌యికలో మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందా? లేక కొర‌టాల‌కు మెగా హెల్ప్ అవుతుందా? లేక అంచ‌నాల‌కు అంద‌కుండా మామూలు సినిమా అవుతుందా? అని అభిమానులతో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.