Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్టర్ పెళ్లయిపోయింది

By:  Tupaki Desk   |   17 Feb 2016 10:13 AM IST
యంగ్ డైరెక్టర్ పెళ్లయిపోయింది
X
సినిమాల్లో దర్శకులు కావాలని అడుగుపెట్టే కుర్రాళ్లు.. తమ లక్ష్యం సాధించేదాకా పెళ్లి చేసుకోరు. ఈ లక్ష్యం కొందరికి త్వరగానే నెరవేరిపోతుంది. కొందరికి బాగా ఆలస్యమవుతుంది. ఐతే లక్ష్యం ఎప్పుడు నెరవేరినప్పటికీ.. దర్శకుడిగా మారిన వెంటనే పెళ్లి ప్రయత్నాలు మొదలైపోతాయి. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. కెమెరామన్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కూడా ఇలాగే ఓ ఇంటివాడయ్యాడు. ‘కార్తికేయ’ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించిన కార్తీక్.. ఆ చిత్ర హీరో నిఖిల్ తో ‘సూర్య వెర్సస్ సూర్య’ అనే సినిమా ద్వారా గత ఏడాది దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.

తన దర్శకత్వ కలను నెరవేర్చుకోవడంతో పెళ్లికి సై అనేసిన కార్తీక్.. నిన్న పెళ్లి చేసేసుకున్నాడు. అమ్మాయి ఎవరు అన్న వివరాలు తెలియలేదు కానీ.. కార్తీక్ పెళ్లి ఫొటోను నిన్న ట్విట్టర్లో షేర్ చేసి అతడికి శుభాకాంక్షలు చెప్పాడు నిఖిల్. కార్తీక్ తండ్రి శ్రీనివాస్ ఘట్టమనేని ఐపీఎస్ అధికారి కావడం విశేషం. వీరికి కృష్ణ కుటుంబంతో బంధుత్వం ఉందని కూడా అంటారు. చెన్నైలో ఇంజినీరింగ్ చదివిన కార్తీక్.. సినిమాలపై మక్కువతో సినిమాటోగ్రఫీలోకి వెళ్లాడు. ఆ తర్వాత చాలా త్వరగానే దర్శకత్వ కలను నెరవేర్చుకున్నాడు. ‘సూర్య వెర్సస్ సూర్య’తో మంచి పేరు సంపాదించిన కార్తీక్.. నిఖిల్ తోనే తన రెండో సినిమా చేయాలని చూస్తున్నాడు. దర్శకుడయ్యాక కూడా ఛాయాగ్రహణం వదిలిపెట్టేయకుండా ఇటీవలే ‘ఎక్స్ ప్రెస్ రాజా’కు సినిమాటోగ్రఫీ అందించాడు కార్తీక్.