Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్‌ క‌ళ్యాణ్ కృష్ణ సోద‌రుడు మృతి

By:  Tupaki Desk   |   11 July 2019 12:35 PM IST
డైరెక్ట‌ర్‌ క‌ళ్యాణ్ కృష్ణ సోద‌రుడు మృతి
X
ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ఇంట విషాదం అలుముకుంద‌ని తెలుస్తోంది. క‌ళ్యాణ్ సోద‌రుడు కుస‌ర్ల సురేష్ (43) ఆక‌స్మిక మ‌ర‌ణం ఈ విషాదానికి కార‌ణం. నిన్న రాత్రి తీవ్ర‌మైన గుండె నొప్పితో విజ‌య‌వాడ ఆంధ్రా హాస్పిట‌ల్స్ లో చేరిన కుస‌ర్ల సురేష్‌ తుదిశ్వాస విడిచార‌ని తెలుస్తోంది.

ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబుకు.. సురేష్ - క‌ళ్యాణ్ కృష్ణ సోద‌రులు. క‌ళ్యాణ్ కృష్ణ అంద‌రికంటే చిన్న‌వాడు(యంగ‌ర్ బ్ర‌ద‌ర్). ప్ర‌స్తుతం సురేష్ కుస‌ర్ల పార్థీవ దేహాన్ని స్వ‌స్థ‌లం కాకినాడ‌కు త‌ర‌లించార‌ని తెలుస్తోంది. సురేష్ కుస‌ర్ల తొలుత ఈనాడు- విశాఖ ప‌ట్నం బ్రాంచీలో జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేశారు. అటుపై ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ లోనూ ప్ర‌వేశించారు.

సోగ్గాడే చిన్ని నాయ‌నా.. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి హిట్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ళ్యాణ్ కృష్ణ ప్ర‌స్తుతం అక్కినేని కాంపౌండ్ లోనే మ‌రో చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు. నాగార్జున‌- నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్ ని తెర‌కెక్కించ‌నున్నారు. `బంగార్రాజు` అనే టైటిల్ ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున `మ‌న్మ‌ధుడు 2` చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే క‌ళ్యాణ్ కృష్ణ‌తో బంగార్రాజు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. అయితే ఈలోగానే బ్ర‌ద‌ర్ సురేష్ మ‌ర‌ణం క‌ళ్యాణ్ కృష్ణ‌లో విషాదాన్ని నింపింది. కుస‌ర్ల సురేష్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు.