Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్.. మండుతున్నట్లుంది!

By:  Tupaki Desk   |   30 Jan 2023 12:59 AM IST
హరీష్ శంకర్.. మండుతున్నట్లుంది!
X
మాస్ కమర్షియల్ దర్శకుడిగా హరీష్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఇంతకుముందు చాలా మంచి విజయాలను అందుకున్నాడు. మిరపకాయ్ సినిమాతో అతని విజయప్రస్థానం మొదలైంది. ఇక తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత దువ్వడ్ జగన్నాథమ్ సినిమాతో కూడా కమర్షియల్ గా మరో సక్సెస్ అందుకున్నాడు. ఇక చివరిగా అతని నుంచి గద్దల కొండ గణేష్ సినిమా వచ్చింది. అది కూడా తమిళ సినిమాకు రీమేక్ మూవీ.

అయితే హరీష్ శంకర్ నుంచి ఒక స్ట్రైట్ సినిమాను చూడాలని ఆడియోన్స్ అయితే ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను తెరపైకి తీసుకురావాలి అని చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ స్క్రిప్ట్ ఎందుకో మళ్ళీ క్యాన్సిల్ అయింది. తమిళ సినిమా తేరి రీమేక్ లిస్టులోకి వచ్చినట్లుగా దాదాపు క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఇంకా విషయంలో క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.

ఇక సోషల్ మీడియాలో ఫాన్స్ పై కూడా ఆయన కాస్త అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే నాకు సోదరులతో సమానమని అయితే ఈ మధ్య మాత్రం వాళ్ళు కొంచెం లిమిట్స్ దాటారు అని అందుకే ఈ సినిమా గురించి పెద్దగా ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని హరీష్ శంకర్ మీడియా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ఒకప్పుడు నాకు కూడా అప్డేట్స్ ఇవ్వాలని ఆశగా ఉండేది అని కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ ఆ విధంగా హద్దులు దాటడంతో నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని చెప్పారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనేది రీమేకా కాదా అనేది తర్వాత తెలుస్తుంది అని ఆయన మరొక వివరణ అయితే ఇచ్చారు. ఒక విధంగా ఫ్యాన్స్ అయితే మొదట హరీష్ శంకర్ న ఇలాంటి ప్రాజెక్ట్ చేయవద్దు అని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రశ్నించే ప్రయత్నం చేశారు.

ఇక ఆ విషయంలో ఆయనకు చాల మండినట్లు ఉంది అనే విధంగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా కొందరు ఫ్యాన్స్ ఆ విధంగా చేసే కామెంట్స్ కు అందరిని కూడా నిందించడం అనేది కరెక్ట్ కాదు అని మరి కొంతమంది వాదిస్తున్నారు. ఏదేమైనా కూడా హరీష్ శంకర్ మాత్రం పవన్ కళ్యాణ్ తో ఒక పవర్ఫుల్ సినిమాను తెరపైకి తీసుకురావాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.