Begin typing your search above and press return to search.

బ్లాక్ చేయడం తప్ప మరో మార్గం కనబడటంలేదు: హరీష్ శంకర్

By:  Tupaki Desk   |   11 Jun 2021 8:00 PM IST
బ్లాక్ చేయడం తప్ప మరో మార్గం కనబడటంలేదు: హరీష్ శంకర్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టిన చిత్రాల్లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. 'గబ్బర్‌ సింగ్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత వీరి కాంబినేషన్‌ లో 'PSPK28' వర్కింగ్‌ టైటిల్‌ తో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. దీన్ని గతేడాదినే ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌ తో ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ నేపథ్యంలో టైటిల్స్ - ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు అధికారిక అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది.

ఉగాదికి చిత్ర టైటిల్‌ - ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని భావించామని.. కానీ కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడిందని.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. ఏదైనా అఫీషియల్‌ గానే ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటనలో తెలిపారు. అయినా సరే పవన్ అభిమానులు సైలెంటుగా ఉంటడం లేదు. 'PSPK28' చిత్రానికి ''సంచారి'' ''స్టేట్ కి ఒక్కడు'' లలో ఒకటి ఖరారు చేసారని పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు. టైటిల్ గురించి రూమర్స్ వస్తున్నాయని.. ఇవి స్ప్రెడ్ అవకుండా చూడాలని హరీష్ కు సూచించాడు.

దీనిపై స్పందించిన హరీష్ శంకర్.. ఇవి తన దృష్టికి కూడా వచ్చాయని.. గాసిప్స్ ప్రచారం చేస్తున్న వారిని బ్లాక్ చేయడం తప్ప, మరో దారి కనబడలేదని ట్వీట్ చేసాడు. ఏదేమైనా పవన్ 28వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని ప్రకటించే వరకు ఈ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.