Begin typing your search above and press return to search.

రిలీజ్ కు ముందే సింగం 3 షాకింగ్ రికార్డ్

By:  Tupaki Desk   |   7 Feb 2017 6:40 AM GMT
రిలీజ్ కు ముందే సింగం 3 షాకింగ్ రికార్డ్
X
స్టార్ హీరోలు నటించే సినిమాలు విడుదలకు ముందు.. తర్వాత రికార్డులు సృష్టిస్తుంటాయి. కానీ.. షాకింగ్ రికార్డ్స్ చాలా అరుదుగా ఉంటాయి. అది కూడా.. అగ్రశ్రేణి హీరోల విషయంలో అలాంటి అరుదుగా జరుగుతుంటాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సూర్య నటించిన సింగం 3 సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అనవసరమైన సీన్లను షూట్ చేయటం వల్ల ఖర్చు తడిచి మోపెడు అవుతుందన్న విమర్శ ఉంటుంది. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో చాలా ప్లాన్డ్ గా మూవీని షూట్ చేయటం కనిపిస్తోంది. అందుకు భిన్నంగా సింగం 3 షూటింగ్ లో చోటు చేసుకుందని చెబుతున్నారు. సాధారణంగా పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు కొన్ని షాట్లను ఎడిటింగ్ లో తీయటం కామన్.

కానీ..సింగం 3 కోసం తీసిన మొత్తం షాట్లలో కేవలం 0.8శాతం మాత్రాన్నే వాడారట. మిగిలిన సీన్లు మొత్తాన్ని సింగం 4.. సింగం 5 లో వాడతారని చెబుతున్నారు. సింగం 3 కోసం ఏకంగా 17 లక్షల రోల్స్ ను షూట్ చేసినట్లుగా చిత్ర దర్శకుడు చెప్పటం షాకింగ్ గా మారింది. 17లక్షల రోల్స్ షూట్ చేసిన ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ తర్వాత 14వేల రోల్స్ మాత్రమే సినిమా పరిమితం చేశారట. ఈ విషయాన్ని విన్నప్పుడు హీరో సూర్య ఓపికకు.. సహనానికి హేట్సాప్ చెప్పాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/