Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ ఇచ్చేశారా గ్రీన్ సిగ్న‌ల్?

By:  Tupaki Desk   |   27 Sep 2019 3:28 PM GMT
ప‌వ‌ర్ స్టార్ ఇచ్చేశారా గ్రీన్ సిగ్న‌ల్?
X
ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారంటూ గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్ర‌చారాన్ని జ‌న‌సేనాని ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తూనే వున్నారు. తాజాగా `సైరా` ప్రీరిలీజ్ వేడుక‌లో పాల్గొన్న ప్ర‌ముఖులంతా మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాలు చేస్తాడ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం ప‌వన్ క‌ల్యాణ్ ని క‌లిశాడ‌ని వార్త‌లు షికారు చేశాయి. త్వ‌ర‌లోనే దీనిపై ప‌వ‌న్ ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని కూడా ప్ర‌చారం మొద‌లైంది. బ‌య‌టికి రీఎంట్రీ వుండ‌ద‌ని ప‌వ‌న్ చెబుతున్న‌ప్ప‌టికి ఆయ‌న‌కు ఇప్ప‌టికే అడ్వాన్స్ ఇచ్చిన సంస్థ‌ల లీకుల‌తో ప‌వ‌న్ రీఎంట్రీ త‌ప్ప‌కుండా ఉంటుంద‌నే సంకేతాలు అందిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి క‌ల‌వ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. హీరో సూర్య‌తో ద‌ర్శ‌కుడు హ‌రి `సింగం` సీక్వెల్స్ ని అందించిన విష‌యం తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్ ని అందించ‌డంలో హ‌రి శైలి ప్ర‌త్యేకం. ప‌వ‌న్ ఇమేజ్ కి త‌న పంథా జ‌త చేసి ద‌ర్శ‌కుడు హ‌రి ఓ టెర్రిఫిక్ స్టోరీని సిద్ధం చేసి ప‌వ‌న్ ని సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తోంద‌ట‌.

ఇదిలా వుంటే క్రిష్ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఓ క‌థ వినిపించాడ‌ని.. ఆ క‌థ ప్ర‌ముఖ నిర్మాత ఏఎం ర‌త్నంకు బాగా న‌చ్చింద‌ని ఆయ‌నే ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది మ‌రో వార్త‌. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని చాలా వార్త‌లొచ్చాయి. కానీ ఏదీ కార్య‌రూపం దాల్చ‌లేదు. మ‌రి ఈ ఇద్ద‌రి ద‌ర్శ‌కుల‌తో అయినా ప‌వ‌న్ సినిమా చేస్తాడా లేదా? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.