Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక శాంతిచచ్చు

By:  Tupaki Desk   |   1 Dec 2016 10:13 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక శాంతిచచ్చు
X
కోలీవుడ్ దర్శకుడు హరికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ఉంది. సింగం సిరీస్ తో దేశవ్యాప్తంగా ఈ డైరెక్టర్ పేరు మార్మోగిపోయింది. ఎన్టీఆర్ ను ఈ దర్శకుడు అవమానించాడంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారటగా అని ఓ విలేకరి ప్రశ్నిస్తే.. ఏకంగా "ఎన్టీఆర్ ఎవరు?" అని దర్శకుడు హరి అన్నాడన్నది వాటి సారాంశం.

ఈ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేశాయి. కోట్లాది మంది అభిమానులున్న ఓ స్టార్ హీరో ఎవరో తెలీదని.. ఓ దర్శకుడు అనడంపై మండిపడ్డారు. అయితే.. ఎన్టీఆర్ అంతటి పెద్ద హీరోను.. ఓ స్టార్ డైరెక్టర్ ఇలాంటి కామెంట్స్ తో అవమానించే అవకాశం లేదని తుపాకి.కాం గతంలోనే చెప్పింది. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు అసలు విషయం బైటకొచ్చింది. తాను అలాంటి కామెంట్స్ చేయలేదని తేల్చేశాడు హరి. తాను ఎన్టీఆర్ ని ఎంతో అభిమానిస్తానన్న హరి.. చాలాసార్లు కలిశానని కూడా చెప్పాడు. అంతే కాదు.. ఓ సబ్జెక్ట్ విషయంలో మాట్లాడుకున్నామని.. కానీ పలు కారణాలతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని చెప్పాడు.

కనీసం తనను వివరాలు అడిగి తెలుసుకోకుండానే.. పేరు మోసిన వెబ్ సైట్లు.. ఛానల్స్ కథనాలు ప్రసారం చేయడంపై హరి మండిపడ్డాడు. తాను ఎన్టీఆర్ ను ఇన్సల్ట్ చేసే సమస్యలేదన్నది హరి మాట. తమ అభిమాన హీరోపై కామెంట్ చేయలేదని డైరెక్టర్ హరి తేల్చేశాడు కాబట్టి.. ఇక ఈ విషయంలో హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉపశమనం పొందచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/