Begin typing your search above and press return to search.

అఖిల్‌ 5 కి ఆ డైరెక్టర్‌ ఖరారు

By:  Tupaki Desk   |   19 Nov 2019 11:48 AM IST
అఖిల్‌ 5 కి ఆ డైరెక్టర్‌ ఖరారు
X
అఖిల్‌ అక్కినేని హీరోగా ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. కాని అక్కినేని ఫ్యాన్స్‌ ను పూర్తి స్థాయిలో మెప్పించిన సినిమా మాత్రం ఇంకా రాలేదు. ఈ సమయంలోనే అఖిల్‌ తన సినిమాల విషయంలో చాలా చాలా విషయాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తన 4వ సినిమాను చేస్తున్న అఖిల్‌ వచ్చే ఏడాది ఆరంభంలోనే తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని సమాచారం అందుతోంది. ఇక ఇదే సమయంలో అఖిల్‌ 5వ సినిమా గురించి ప్రచారం జరుగుతోంది.

కొన్ని వారాల క్రితం అఖిల్‌ తో ప్రముఖ తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ కలిశాడంటూ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కథా చర్చలు జరిగాయని కూడా టాక్‌ వచ్చింది. అప్పుడు ఆ విషయమై ఎలాంటి లీక్‌ లు రాలేదు. కాని ఇన్ని రోజుల తర్వాత అఖిల్‌ 5వ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకుడిగా వర్క్‌ చేయబోతున్నట్లుగా అక్కినేని వర్గాల నుండి లీక్‌ వచ్చింది. అతి త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మిత్రన్‌ చెప్పిన కథ విషయంలో అఖిల్‌ చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్‌ తో చేస్తున్న సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం మిత్రన్‌ తో మొదలు పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది వేసవి ఆరంభంలోనే అఖిల్‌ 5 మూవీ పట్టాలెక్కి వచ్చే ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈ సినిమాను నిర్మించేది ఎవరు.. ఇతర వివరాలను అతి త్వరలోనే వెళ్లడవ్వనున్నాయి.