Begin typing your search above and press return to search.

మీరెప్పుడు కొట్టించుకుంటారు సార్ క్లాప్?

By:  Tupaki Desk   |   11 Nov 2022 1:30 PM GMT
మీరెప్పుడు కొట్టించుకుంటారు సార్ క్లాప్?
X
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల‌ర్' స‌క్సెస్ తో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ట్రాక్ లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ద‌ర్శ‌కుడిగా భాస్క‌ర్ మ‌ళ్లీ ఫుల్ బిజీ అవుతాడని భావించారు. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ లో క‌నిపిస్తుంది. బ్యాచిల‌ర్ రిలీజ్ అయి ఏడాది పూర్త‌యింది. అందులో హీరోగా న‌టించిన అకిల్ ' ఏజెంట్' సినిమాలో షూట్ లో బిజీగా ఉన్నాడు.

ఇదే స‌క్సెస్ తో రెండు..మూడు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. కానీ విజ‌యాన్ని అందించిన భాస్క‌ర్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ అప్ డేట్ కూడా లేదు. మ‌రి ఈ ఆల‌స్యం దేనికి? హీరోలు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదా? లేక భాస్క‌ర్ కి క‌థ కుద‌ర‌క వెయిట్ చేస్తున్నాడా? అన్న‌ది అర్ధం కానీ ప్ర‌శ్న‌.

సాధార‌ణంగా భాస్క‌ర్ స్ర్కిప్ట్ సిద్దం చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గానే తీసుకుంటారు. వైఫ‌ల్యాలు ఎదురైన స‌మ‌యంలో క‌థ‌లు రెడీగా ఉన్న అవకాశం ఇవ్వ‌డానికి ఏ హీరో ముందుకు రాలేదు. ఇప్పుడు విజ‌యం ఖాతాలో ఉన్నా ఛాన్స్ ద‌క్క‌డం లేదు. మ‌రి కొత్త ఏడాది 2024 లోనైనా తీపి క‌బురు వినిపిస్తాడా? అన్న‌ది చూడాలి.

వాస్త‌వానికి భాస్క‌ర్ బ్యాచిల‌ర్ రిలీజ్ త‌ర్వాత మీడియా కంట ప‌డింది లేదు. దాదాపు ఏడాది త‌ర్వాత నిన్న‌టి రోజున ఓ సినిలా లాంఛింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆ సినిమాకి క్లాప్ కొట్టి టీమ్ అందర్నీ విష్ చేసారు. ఈ స‌ద‌ర్భంగా మీడియాలో భాస్క‌ర్ హైలైట్ అయ్యారు.

హిట్ ఇచ్చినా ఇంకా ఖాళీగా ఉన్నారు? అవ‌కాశం రాలేదంటూ ! ఫిలిం స‌ర్కిల్స్ లో ఆ కొద్ది సేపు హాట్ టాపిక్ అయ్యారు.

మ‌రి ఛాన్స్ అందుకుని అదే మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతారో చూడాలి. ప్ర‌స్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. టైర్ -2 హీరోలు కూడా రెండు..మూడు సినిమాల‌తో బిజీగానే గ‌డుపుతున్నారు. స్ర్కిప్ట్ బాగా న‌చ్చితే డేట్లు స‌ర్దుబాటు చేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేస్తున్నారు. మ‌రి భాస్క‌ర్ వ‌చ్చే ఏడాది ఏ రేంజ్ హీరో డేట్లు ప‌డ‌తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.