Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ తో అప్పుడు.. ఇప్పుడు

By:  Tupaki Desk   |   29 Jan 2016 10:39 AM IST
మెగాస్టార్‌ తో అప్పుడు.. ఇప్పుడు
X
మనం ఓ సామాన్యుడిగా ఉండగా ఓ సెలబ్రెటీతో ఫొటో దిగి.. ఇప్పుడో ఓ స్థాయి అందుకున్నాక అదే సెలబ్రెటీ వచ్చి మనల్ని కలిసినపుడు మళ్లీ ఫొటో దిగితే ఎంత బాగుంటుంది కదా. టాలీవుడ్ డైరెక్టర్ రవీంద్ర అలియాస్ బాబీ ఇప్పుడు అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట.. ఏ ఐడెంటిటీ లేకుండా మెగాస్టార్ ను కలిసి ఓ ఫొటో దిగాడు బాబీ.

ఇప్పుడు అతను ఓ డైరెక్టర్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసిన లక్కీ డైెరెక్టర్. మొన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ స్పాట్ కి మెగాస్టార్ విచ్చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబీతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు చిరు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను.. ఒకప్పుడు తాను టీనేజీలో ఉండగా ఓ అభిమానిగా చిరుతో తీయించుకున్న ఫొటోను చూసుకుని మురిసిపోతున్నాడు బాబీ. ఈ రెండు ఫొటోల్ని కలిపి ట్విట్టర్లో అతడి మిత్రుడు పోస్ట్ చేయగా.. బాబీ ఆనందానికి అవధుల్లేవు.

మొన్నటి చిరు-బాబీ కలయికకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ కూడా హల్ చల్ చేస్తోంది. ‘సర్దార్..’ తర్వాత తనతో సినిమా చేసే ఛాన్స్ కూడా చిరు ఇచ్చాడని.. మంచి కథ ఉంటే రెడీ చేసుకోమనరి అంటున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే బాబీకి అంతకంటే ఆనందం కలిగించే వార్త మరొకటి ఉండదు. రెండో సినిమానే పవన్ తో, మూడో సినిమానే చిరుతో చేయడమంటే మాటలా?