Begin typing your search above and press return to search.

నిర్మాతగా పవర్ చూపిస్తాడట

By:  Tupaki Desk   |   27 March 2018 5:09 PM GMT
నిర్మాతగా పవర్ చూపిస్తాడట
X
పవర్ మూవీతో మాస్ మూవీస్ చేయడంలో తన పవర్ చూపించిన దర్శకుడు బాబీ.. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో మూవీ చేసి ఫ్లాప్ ఎదుర్కున్నా.. ఎన్టీఆర్ జై లవకుశతో మంచి సక్సెస్ నే సాధించాడు. ఇప్పుడు తన మరుసటి చిత్రాన్ని వెంకటేష్.. నాగ చైతన్యలతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు బాబీ.

ఒకవైపు దర్శకుడిగా తన కెరీర్ కంటిన్యూ చేస్తూనే.. మరోవైపు నిర్మాతగాను తన అదృష్టం పరీక్షించుకునేందుకు బాబీ ప్రిపేర్ అయిపోతున్నాడు. ఇప్పటికే కథా చర్చలు అన్నీ కంప్లీట్ అయిపోగా.. అరుణ్ పవార్ తో సినిమా బాబీ. ఇప్పటికి అయితే కథ ఓకే అవడం.. నిర్మాతగా బాబీ వ్యవహరించాలని ఫిక్స్ అవడం వరకే జరిగాయట. మిగిలిన పనులను కూడా చకచకా పూర్తి చేసి.. త్వరలో మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నారట. ఓ యంగ్ హీరోతో ఈ సినిమాలో నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

హీరో ఎవరు అనే అంశం ఫైనలైజ్ అయిన తర్వాత మూవీ అనౌన్స్ ఉండొచ్చని అంటున్నారు. అయితే.. ఈ లోగా ఇతర టెక్నికల్ టీంకు సంబంధించిన పనులను.. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే బాబీ నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత.. ఇప్పటికే ఈ కోవలోకి చేరిన త్రివిక్రమ్.. సుకుమార్ వంటి కొందరు దిగ్గజ దర్శకుల జాబితాలోకి చేరిపోతున్నాడు బాబీ.