Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న బాబీ

By:  Tupaki Desk   |   7 Feb 2023 2:00 PM GMT
బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న బాబీ
X
టాలీవుడ్ దర్శకులు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి సినిమాలు చేస్తున్నారు. వారిలో కొంత మంది సక్సెస్ కూడా అవుతున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి రీమేక్ తో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఏకంగా రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దీని తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని అతను చేయనున్నాడు.

ఇక గౌతమ్ తిన్ననూరి కూడా బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ తో అడుగుపెట్టాడు. అయితే అక్కడి ప్రేక్షకులని జెర్సీ రీమేక్ తో అతను మెప్పించాలేకపోయాడు. ఇక శైలేంద్ర కొలను కూడా హిట్ రీమేక్ తో బాలీవుడ్ లోకి వెళ్ళిన అక్కడ సత్తా చాటలేకపోయాడు.

గతంలో పూరీ జగన్నాథ్ బాలీవుడ్ లోకి వెళ్లి అమితాబచ్చన్ తో బుడ్డా హోగ తెర బాప్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక వివి వినాయక్ ఇప్పుడు చత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఇక పాన్ ఇండియా కథలతో మన దర్శకులు అందరూ కూడా బాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నాయి. అయితే దర్శకులుగా వారి ముందు ఉన్న ఫస్ట్ ఛాయస్ తెలుగువాళ్ళే అని తెలుస్తుంది.

హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ లాంటి దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నారు. అయితే వీరిలో బాబీ ఇప్పుడు మంచి కథని సిద్ధం చేసి హిందీ ప్రాజెక్ట్ కోసం మైత్రీ నిర్మాతలకి వినిపించినట్లుగా బోగట్టా. ఇక హృతిక్ రోషన్ లేదంటే ఇంకో పవర్ ఫుల్ హీరోతో ఈ మూవీ చేయడానికి బాబీ రెడీ అవుతున్నట్లుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. అదే జరిగితే తమ మాస్ కాన్సెప్ట్ తో బాబీ బాలీవుడ్ లో కూడా సత్తా చాటే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.