Begin typing your search above and press return to search.

‘జైలవకుశ’ రవితేజ కోసం రాసింది కాదు..

By:  Tupaki Desk   |   20 Sep 2017 2:54 PM GMT
‘జైలవకుశ’ రవితేజ కోసం రాసింది కాదు..
X
దర్శకుడిగా తొలి సినిమా ‘పవర్’తో మంచి పేరే సంపాదించినప్పటికీ.. రెండో సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాబీని బాగా ఇబ్బంది పెట్టేసింది. ఆ సినిమా స్క్రిప్టు తనది కాకపోయినప్పటికీ ఫెయిల్యూర్ తాలూకు చెడ్డ పేరును మోయాల్సి వచ్చింది. ఫ్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు ‘సర్దార్’ తర్వాత ఇంకో ప్రాజెక్టు సెట్ కావడానికి కూడా చాలా టైం పట్టేసింది. మధ్యలో రవితేజతో ఓ సినిమా దాదాపుగా కన్ఫమ్ అయినట్లే అయి.. క్యాన్సిలైపోయింది. ఆ తర్వాత మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు బాబీ. దీంతో రవితేజ కోసం రాసిన కథనే బాబీ అటు ఇటు మార్చి ఎన్టీఆర్ కు సెట్ చేశాడని ఊహాగానాలు వినిపించాయి.

ఈ ప్రచారం అవాస్తవమని బాబీ చెప్పాడు. రవితేజ కోసం అనుకున్నది వేరే కథ అని.. వేరే కారణాల వల్ల ఆ సినిమా ఆరంభం కాలేదని చెప్పాడు బాబీ. ఎన్టీఆర్ కోసం ఫ్రెష్ గా ‘జై లవకుశ’ కథ రాశానని అతను చెప్పాడు. ఈ కథ రాస్తున్నపుడు తాను చాలా ఒత్తిడికి గురయ్యానని.. ఈ కథతో ఎట్టి పరిస్థితుల్లోనూ హీరోను మెప్పించి సినిమా ఓకే చేయించుకోవాల్సిన స్థితిలో తాను ఉన్నానని అన్నాడు బాబీ. కథ రెడీ అయ్యాక కొరటాల శివను సంప్రదించి ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నాడా లేదా అని తెలుసుకుని.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంపౌండ్లోకి అడుగుపెట్టినట్లు బాబీ చెప్పాడు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’కు ఓకే చెప్పగానే తనకు చాలా రిలీఫ్ గా అనిపించిందని.. అతను తాను అనుకున్న దాని కంటే ఎక్కువగా ఈ కథను ఓన్ చేసుకున్నాడని బాబీ చెప్పాడు.