Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డ్యాన్స్ చించేస్తున్నాడంట

By:  Tupaki Desk   |   26 July 2017 4:54 PM IST
ఎన్టీఆర్ డ్యాన్స్ చించేస్తున్నాడంట
X
జూనియర్ ఎన్టీఆర్ తో పని చేసిన ప్రతి దర్శకుడూ అతడి గురించి గొప్పగా చెబుతుంటారు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ‘నాన్నకు ప్రేమతో’ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఓ రేంజిల చెప్పాడు. ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ చేసిన కొరటాల శివ సైతం అతణ్ని తెగ పొగిడేశాడు. ఇప్పుడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ వంతు వచ్చింది. తారక్ తో ‘జై లవకుశ’ చేస్తున్న బాబీ ఇంతకుముందే ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు తారక్ డ్యాన్సుల విషయమై పొగిడేశాడు బాబీ. ప్రస్తుతం ‘జై లవకుశ’ పాటల చిత్రీకరణ జరుగుతోందట. ఆ సందర్భంగా ఎన్టీఆర్ డాన్సింగ్ టాలెంట్ చూసి షాకయ్యానంటున్నాడు బాబీ.

‘‘ఎన్టీఆర్ గారు మన కళ్ల ముందు డ్యాన్స్ చేస్తుంటే చూడటం నమ్మశక్యం కాని అనుభవం. ఆ ప్రతిభ అతడికి వరం. తారక్ ను అలా చూడటం నా అదృష్టం’’ అంటూ ఇవాళ ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు బాబీ. ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులేమున్నాయి చెప్పండి. ‘జై లవకుశ’లోనూ తమ అభిమాన కథానాయకుడు డ్యాన్సులతో చితగ్గొట్టేసి ఉంటాడంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ప్రస్తుతం ‘జై లవకువ’ షూటింగ్ పుణెలో ‘రామ్ లీలా’ షూటింగ్ జరుపుకున్న ప్యాలెస్ లో జరుగుతోంది. ఆగస్టు నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తయిపోతుందని సమాచారం. ఆగస్టు 12న ఆడియో లాంచ్ అంటున్నారు. సెప్టెంబరు 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్.