Begin typing your search above and press return to search.

హిట్టొచ్చినా దర్శకుడి దశ మారలే

By:  Tupaki Desk   |   7 Feb 2018 2:30 AM GMT
హిట్టొచ్చినా దర్శకుడి దశ మారలే
X
కొన్ని సార్లు అంతే.. కాలం ఏ మాత్రం కలిసి రాదు. పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ కు దర్శకత్వం వహించాడు బాబీ. ఆ చిత్రం ఫ్లాప్ భారాన్ని మోయాల్సి వచ్చింది. అటు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో పాటు.. ఇటు ఈ దర్శకుడి సమర్ధత పైనా సందేహాలు వ్యక్యమయ్యే పరిస్థితి వచ్చింది.

ఆ తర్వాత ఎలాగోలా మళ్లీ స్టార్ హీరోతో సినిమా ఒప్పించుకున్నాడు. ఎన్టీఆర్ ను మూడు పాత్రల్లో చూపిస్తూ జైలవకుశ మూవీ చేసి జనాలను మెప్పించాడు. బాక్సాఫీస్ పరంగా కూడా సూపర్ హిట్ నే సాధించాడు. కానీ ఈ సక్సెస్ లో వన్ పర్సెంట్ కూడా బాబీకి దక్కకపోవడం ఆశ్చర్యకరం. వీలైనంత తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేసి.. 70 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించిన సినిమాను తీసిన దర్శకుడు అంటే.. అవకాశాలు క్యూ కట్టేయాలి. కానీ ఇలాంటివేమీ జరగలేదు సరికదా.. ఎవరూ పిలిచి ఛాన్స్ ఇవ్వలేదు.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యను ఓ సినిమా ఒప్పించేందుకు చక్కర్లు కొడుతున్నాడట బాబీ. చైతు నుంచి కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఏదీ రాలేదు. కాకపోతే ఈ దర్శకుడు చెప్పిన మూడు సబ్జెక్టులలో ఒకదాని గురించి మాత్రం సీరియస్ గానే చర్చలు జరుగుతున్నాయట. స్టోరీ లైన్ ఓకే అయినా.. దాన్ని డెవలప్ చేసిన తీరుపై మాత్రం ఇంకా అక్కినేని టీం అసంతృప్తిగానే ఉంది. ఒకవేళ ఇది ఓకే అయినా.. అది పట్టాలెక్కేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది. కట్ చేస్తే ఈలోపు మనోడు 'ఛలో' తో హిట్టు కొట్టిన నాగ శౌర్యను కూడా కలసి ఒక లైన్ చెబుతున్నాడట. చూద్దాం ఏమవుతుందో