Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తర్వాత బన్నీతోనా??

By:  Tupaki Desk   |   28 Aug 2017 1:59 PM IST
ఎన్టీఆర్ తర్వాత బన్నీతోనా??
X

రచయితగా కెరీర్ ను స్టార్ చేసి 'పవర్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కె.ఎస్ రవీంద్ర. ఇక రెండవ సినిమాతో పవర్ స్టార్ సినిమానే డైరెక్ట్ చేసే ఛాన్స్ ని కొట్టేశాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా సక్సెస్ కాకపోయినా ఎన్టీఆర్ తో "జై లవకుశ" స్క్రిప్ట్ ను ఒకే చేయించాడు. ప్రస్తుతం ఆ సినిమా చివరిదశలో ఉండగానే త్వరలో మరో స్క్రిప్ట్ ను మెగా హీరోతో ఒకే చేయించాడట ఈ డైరక్టర్.

రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఓ కథను వినిపించి మెప్పించాడట ఈ యువ దర్శకుడు. ప్రస్తుతం బన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో "నా పేరు సూర్య" సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అయిపోగానే బన్నీ తమిళ దర్శకుడు లింగు స్వామితో వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. ఆ సినిమా తర్వాత రవీంద్ర- బన్నీతో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేస్తాడని ఒక టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా "జై లవకుశ" సినిమా ప్రభావం కూడా బన్నీ ప్రాజెక్టు పై ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే బన్నీ ఆ దర్శకుడితోనే సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అయితే జై లవకుశ ఇప్పటికే టీజర్స్ తో అందరిని ఆకర్షిస్తోంది. మరి హిట్టయితే పవర్ డైరక్టర్ రూటే మారిపోతుంది.

ఇంకో రూమర్ ఏంటంటే.. ఇప్పటికే జై లవ కుశ సినిమా రషెస్ అన్నీ చూసి అటు కళ్యాణ్‌ రామ్ ఇటు ఎన్టీఆర్ బాగా కాన్ఫిడెంటుగా ఉన్నాడట. అదే విషయాన్ని బన్నీకి కూడా చెప్పడంతో..ఈ మెగా హీరో కూడా కథను ఓకె చేసి జై లవకుశ రిజల్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. అది సంగతి.