Begin typing your search above and press return to search.

బాబీకి మెగా క్యాంప్ ఆఫ‌ర్?

By:  Tupaki Desk   |   12 Dec 2019 4:40 AM GMT
బాబీకి మెగా క్యాంప్ ఆఫ‌ర్?
X
టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ స్పీడందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికిప్పుడు కొన్ని క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి. మెగా మ‌ల్టీస్టార‌ర్ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. మెగా కాంపౌండ్ మ‌ల్టీస్టార‌ర్ డైరెక్టర్ కి గాలం వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో మ‌ల్టీస్టార‌ర్ `వెంకీ మామ‌` సౌండ్ గ‌ట్టిగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మామా అల్లుళ్లు విక్ట‌రీ వెంక‌టేష్‌- నాగ‌చైత‌న్యల‌ను క‌లిపి బాబి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్- పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

భారీ అంచ‌నాల న‌డుమ‌ `వెంకీమామ` ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆ క్ర‌మంలోనే బాబీ పేరు ప్ర‌చారంలో మార్మోగుతోంది. మామా అల్లుళ్ల‌ను క‌లిపి బాక్సాఫీస్ రేసులో నిల‌బ‌డే ద‌మ్మున్న సినిమా తీశాడా లేదా? అన్న‌ది కొన్ని గంట‌ల్లోనే అమెరికా ప్రీమియ‌ర్ల‌తో తొలి రిపోర్టు రానుంది. అయితే ఈ సినిమా రిజ‌ల్ట్ తేల‌క‌ముందే వెంకీమామ ద‌ర్శ‌కుడు బాబీ ఖాతాలో మెగా మ‌ల్టీస్టార‌ర్ చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

బాబీ డైరెక్ష‌న్ లో గీతా ఆర్ట్స్ ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ ని ప్లాన్ చేస్తోంద‌ని.. ఇందులో అల్లు అర్జున్ కీ రోల్ పోషించే అవ‌కాశం వుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీని కోసం ద‌ర్శ‌కుడు బాబిని గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు సంప్ర‌దించాయిట‌. బాబీ కూడా ఆఫ‌ర్ న‌చ్చ‌డంతో ఇందు కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే ప‌నిలోప‌డిన‌ట్టు ఫిలింస‌ర్కిల్ వ‌ర్గాల స‌మాచారం. ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వ‌స్తుంది? ఇందులో అల్లు అర్జున్ తో పాటు న‌టించే హీరో ఎవ‌రు? అన్న వివ‌రాలు త్వ‌ర‌లోనే రివీల్ చేస్తార‌ట‌. అయితే దీనిపై గీతా ఆర్ట్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది.