Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేస్ : ఈ ఇద్దరు ద‌ర్శ‌కుల్లో గెలిచేది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   2 Nov 2022 3:30 AM GMT
సంక్రాంతి రేస్ : ఈ ఇద్దరు ద‌ర్శ‌కుల్లో గెలిచేది ఎవ‌రు?
X
వ‌చ్చే సంక్రాంతి పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్న విష‌యం తెలిసిందే. చాలా ఏళ్ల విరామం త‌రువాత సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సంక్రాంతికి పోటీప‌డుతున్నారు. వీరిద్ద‌రు సంక్రాంతి బ‌రిలో పోటీప‌డి దాదాపు ఆరేళ్ల‌వుతోంది. గ‌తంలో చిరు క‌మ్ బ్యాక్ ఫిల్మ్ `ఖైదీ నంబ‌ర్ 150`తో సంక్రాంతికి పోటిప‌డ్డారు. అదే స‌మ‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి`తో పోటికి దిగాడు. అయితే ఈ పోటీలో మెగాస్టార్ విజ‌యం సాధించి అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

మ‌ళ్లీ ఇన్నాళ్లుకు ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు సంక్రాంతి బ‌రిలో నిలుస్తున్నారు.సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `వాల్తేరు వీర‌య్య‌`. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా అతిథి పాత్ర‌లో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించ‌బోతున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలే వున్నాయి. కానీ ద‌ర్శ‌కుడి ట్రాక్ రికార్డ్ మాత్రం ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తోంది.

ఇటీవ‌ల చిరు వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీనికి తోడు ద‌ర్శ‌కుడు బాబి ట్రాక్ రికార్డ్ కూడా కొంత భ‌య‌పెడుతోంద‌ట‌. బాబి `ప‌వ‌ర్‌` త‌రువాత ఆ స్థాయి స‌క్సెస్ ని ఇంత వ‌ర‌కు అందుకోలేక‌పోయాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌` చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆ త‌రువాత ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యంలో తెర‌కెక్కించిన `జై ల‌వ‌కుశ‌` ఫ‌ర‌వాలేద‌నిపించింది. విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌ల‌తో చేసిన `వెంకీ మామ‌` కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక నిరాశ ప‌రిచింది. ఇక బాల‌కృష్ణ న‌టిస్తున్న మూవీ `వీర సింహారెడ్డి`. ఈ మూవీకి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు.

`బ‌లుపు` త‌రువాత `క్రాక్` తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన గోపీచంద్ ఈ మూవీతో స్టార్ డైరెక్ట‌ర్ ల జాబితాలో చేరాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నాడు. `క్రాక్` మూవీని త‌మిళ హిట్ ఫిల్మ్ `సేతుప‌తి`లోని కీల‌క సీన్ ల ఆధారంగా తెర‌కెక్కించిన గోపీచంద్ మ‌లినేని `వీర సింహారెడ్డి`ని కూడా క‌న్న‌డ మూవీ `ముఫ్టీ` ఆధారంగా రూపొందిస్తున్నాడ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే బాల‌య్య `వీర సింహారెడ్డి`తో ఈ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకోవ‌డం ఖాయం అని తెలుస్తోంది.

టీజ‌ర్ లో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో ప‌వ‌ర్ ఫుల్ గా బాల‌య్య క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఇప్ప‌టికే అంచ‌నాల్ని పెంచేసింది. `అఖండ‌` బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో రెట్టించి ఉత్సాహంతో వున్న బాల‌య్య అదే ఊపుని `వీర సింహారెడ్డి`తోనూ కొన‌సాగించ‌బోతున్నార‌ని ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. అయితే చిరుకు ర‌వితేజ అయినా క‌లిసి వ‌స్తాడేమోన‌ని చిరు ఫ్యాన్స్ గట్టి న‌మ్మ‌కంతో ఎదురుచూస్తున్నారు. మ‌రి సంక్రాంతి స‌మ‌రంలో ఏ ద‌ర్శ‌కుడు పై చేయి సాధిస్తాడో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.