Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ విడాకులపై టాలీవుడ్ లో హాట్ డిబేట్

By:  Tupaki Desk   |   9 March 2022 2:30 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్ విడాకులపై టాలీవుడ్ లో హాట్ డిబేట్
X
ఇటీవ‌లి కాలంలో విడాకుల ఫ‌ర్వం మ‌రీ తీవ్ర‌త‌ర‌మైంది. అంతా క‌లికాల మ‌హిమ.. కాలంతో పాటే ప‌రిణామం! అన్న డిబేట్ స‌ర్వ‌త్రా సాగుతోంది. మాన్యులు సామాన్యులు సాధార‌ణ ప్ర‌జ‌లు సెల‌బ్రిటీలు అనే తేడా లేదు. ముఖ్యంగా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా త‌ర‌చి చూసే సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఈ విడాకుల ఫ‌ర్వానికి మ‌రీ విప‌రీతంగా ప్ర‌చారం ద‌క్కుతోంది.

ఇంత‌కుముందే అమీర్ ఖాన్ - కిర‌ణ్ రావు.. అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత‌.. ధ‌నుష్ - ఐశ్వ‌ర్య జంట‌లు విడిపోతున్నామ‌ని ప్ర‌క‌టించి షాకిచ్చాయి. ఆ ప్ర‌క‌ట‌న‌ల‌తో అభిమానులు తీవ్ర క‌ల‌త‌కు గుర‌య్యారు.

తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు 17 ఏళ్ల తన భార్యకు విడాకులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్టార్ డైరెక్ట‌ర్ బాలా అతని భార్య ముత్తుమలర్ మార్చి 5 న ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికే నాలుగేళ్లుగా విడిపోయి పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

బాల .. అతని భార్య ప్రార్థన అనే అందమైన పాపకు తల్లిదండ్రులు. బాలా - మలర్ ల విడాకుల వార్త పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి అంద‌మైన పాప‌కు ఈ క‌ల‌త స‌రికాద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక త‌మిళ ద‌ర్శ‌కుడే అయినా కానీ బాలా కు తెలుగు లోనూ అభిమానులున్నారు. అత‌డు తీసిన రా అండ్ ర‌స్టిక్ సినిమాల‌కు అత‌డు సృజించిన గ్రేట్ క్యారెక్ట‌ర్ల‌కు గొప్ప అభిమానులున్నారు. ఒక సెక్ష‌న్ అభిమానులు అత‌డిని విప‌రీతంగా అభిమానిస్తార‌న్న‌ది తెలిసిన‌దే. న‌వ‌త‌రం ఔత్సాహిక ద‌ర్శ‌కులు బాలాను ఎక్కువ‌గా అభిమానిస్తారు.

జాతీయ అవార్డ్ ద‌ర్శ‌కుడిగానూ బాలాకు గొప్ప గుర్తింపు ఉంది. బాలా ప్ర‌స్తుతం సూర్య‌ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవ‌లి కాలంలో బాలా ఫ్యామిలీ క‌ల‌త‌ల వ‌ల్ల కెరీర్ పై పూర్తిగా కాన్ స‌న్ ట్రేట్ చేయ‌లేక‌పోయాడ‌ని అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. బాలా విడాకుల వ్య‌వ‌హారంపై టాలీవుడ్ అభిమానుల్లోనూ చ‌ర్చ సాగుతోంది.