Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో సినిమా.. అస్సలు నిజం లేదు

By:  Tupaki Desk   |   29 Dec 2017 3:00 PM GMT
ప్రభాస్ తో సినిమా.. అస్సలు నిజం లేదు
X
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రతి సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎక్కడ ఏ చిన్న వార్తలో అతని పేరు వినిపించినా క్షణాల్లోనే అంతటా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆ సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదు. ఎప్పుడు అయిపోతుందో అధికారికంగా చిత్ర యూనిట్ డేట్ ని కూడా చెప్పలేదు.

అయితే ఈ సినిమా గురించి కాకుండా ప్రస్తుతం కోలీవుడ్ లో ప్రభాస్ సాహో తరువాత ఏ సినిమా చేస్తాడు అనే దానిపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అంతే కాకుండా మెర్సల్ దర్శకుడితోనే అతని నెక్స్ట్ సినిమా అని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై ప్రభాస్ నుండి ఎటువంటి ఆన్సర్ రాలేదు కానీ మెర్సల్ దర్శకుడు అట్లీ మాత్రం న్యూస్ ఎక్కువగా వైరల్ అవ్వకముందే క్లారిటీ ఇచ్చేశాడు. అందులో ఏ మాత్రం నిజం లేదని నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ లో ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు అని క్లియర్ గా చెప్పేశాడు.

దీంతో రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది. ప్రస్తుతం అట్లీ కథను రాసుకుంటున్నాడట. త్వరలో కథను పూర్తి చేసి నెక్స్ట్ సినిమా వివరాలను చెబుతానని వివరించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ దృష్టి మొత్తం సహోపైనే ఉంది. నెక్స్ట్ మరో యాక్షన్ షెడ్యూల్ కోసం ప్రభాస్ దుబాయ్ వెళ్లనున్నాడు. బాలీవుడ్ భామ హీరోయిన్ గా నటిస్తోన్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.