Begin typing your search above and press return to search.

రాజమౌళిలా ఆలోచిస్తున్నావ్ అన్నారు

By:  Tupaki Desk   |   13 Nov 2017 3:51 PM GMT
రాజమౌళిలా ఆలోచిస్తున్నావ్ అన్నారు
X
రాజా రాణి సినిమాతో అటు తమిళ్ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న దర్శకుడు అట్లీ ఇప్పుడు మరో సినిమాతో అంతకు మించిన రేంజ్ లో ఆదరణను అందుకున్నాడు. శంకర్ శిష్యుడైన అట్లీ మొదటి సారి గురువు బాటలో నడిచి మంచి కమర్షియల్ హంగులతో మెర్సల్ సినిమాను తీశాడు. ఆ సినిమా తెలుగులో అదిరింది అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవ అనే కంటెంట్ కథతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు.

మెర్సల్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 220 కోట్లను క్రాస్ చేసిందని అలాగే టాప్ లో ఉన్న తమిళ్ కబాలి రికార్డ్ లను కూడా బ్రేక్ చేసిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బాహుబలి రచయిత విజేయేంద్ర ప్రసాద్ రచయిత గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు అట్లీ హైదరాబాద్ కు వచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన విజయేంద్ర ప్రసాద్ గారితో ఉన్న రిలేషన్ గురించి వివరించారు.

అట్లీ మాట్లాడుతూ..తెరి సినిమా కోసం ఒకసారి హైదరాబాద్ లో ప్రమోషన్ చేయడానికి వచ్చినప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారిని కలిశాను. ఆయన రాసిన బజరంగీ భాయ్ జాన్ సినిమా కథ అంటే నాకు చాలా ఇష్టం. అయితే నెక్స్ట్ సినిమా ఆయనతో కలిసి వర్క్ చేయాలని అనుకున్నాను. చెప్పగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా మెర్సల్ కథ రెడీ చేసుకున్నాం. ఆయన చాలా హెల్ప్ చేశారు. కథలో ఇది కరెక్ట్ ఇది కొంచెం చేంజ్ చేయాలి అని చెబుతుంటారు.

అంతే కాకుండా ఆయనను ఒక తండ్రిలా నేను భావిస్తాను. ఎందుకంటే నాతో ఆయన ఒకసారి నువ్వు నాకు మరో కోడుకువి సేమ్ రాజమౌళి లా ఆలోచిస్తున్నవాని చెప్పారు. ప్రేక్షకులకు ఏం కావాలో నీకు తెలుసు.. నా ఫుల్ సపోర్ట్ నికే అని కూడా విజేయేంద్ర ప్రసాద్ తెలిపారని అట్లీ తెలిపాడు.