Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడికి క్లారిటీ వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   7 April 2018 10:40 AM GMT
ఆ దర్శకుడికి క్లారిటీ వచ్చేసిందా?
X
కోలీవుడ్ దర్శకులు తెలుగులో సినిమాలు చేస్తుండడం చూస్తూనే ఉంటాం. ఇక్కడి దర్శకులను తెగ వెయిటింగ్ లో పెట్టే మన హీరోలు.. తమిళ డైరెక్టర్లకు మాత్రం వెంటనే ఛాన్స్ ఇచ్చేయడం గతంలో కనిపించేది. కానీ ఓ కోలీవుడ్ దర్శకుడికి మాత్రం ఆశాభంగం కలిగిందనే టాక్ వినిపిస్తోంది.

తమిళ్ లో వరుస విజయాలు సాధిస్తున్న దర్శకుడు అట్లీ.. తెలుగులో ఓ కమర్షియల్ మూవీ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలను కలిసి కథ చెప్పాడనే టాక్ కూడా వినిపించింది. బాహుబలి సెన్సేషన్ ప్రభాస్ తో పాటు.. స్టైలిష్ స్టార్ గా జనాలు మెచ్చిన అల్లు అర్జున్ ను కలిశాడని.. వీరిలో ఒకరితో అట్లీ సినిమా చేయనున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎంతటి వాస్తవం ఉందనే సంగతి తెలియదు. అయితే.. ఇప్పుడీ దర్శకుడు తన ఉద్దేశ్యం మార్చేసుకున్నాడట. ప్రస్తుతం ఓ తమిళ స్క్రిప్టును డెవలప్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఏ స్టార్ హీరో నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని.. బాగా లేట్ అవుతుండడంతోనే.. ఇలా తమిళ్ మూవీ చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అయితే.. అట్లీ విషయంలో మరో టాక్ కూడా ఉంది.

ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో బై లింగ్యువల్ కు ఓకే చేయించుకున్నాడని.. అందుకే తమిళ్ స్క్రిప్టును డెవలప్ చేస్తున్నాడని.. తమిళనాడులో కూడా తన మార్కెట్ ను పెంచుకునేందుకు ట్రై చేస్తున్న ఆ స్టార్ హీరోతో త్వరలో సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందనే టాక్ కూడా ఉంది.