Begin typing your search above and press return to search.

నాకు ఇద్దరు కూతుర్లు..అలా చేస్తే బాగోదన్నాడు!

By:  Tupaki Desk   |   21 Oct 2018 11:48 AM IST
నాకు ఇద్దరు కూతుర్లు..అలా చేస్తే బాగోదన్నాడు!
X
సౌత్‌ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. షూటింగ్‌ రిహర్సల్స్‌ సందర్బంగా తనతో అర్జున్‌ అసభ్యంగా ప్రవర్తించాడంటూ శృతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. సౌత్‌ లో ఒక హీరోపై ఆరోపణలు రావడంతో చర్చనీయాంశం అయ్యింది. తాజాగా విడుదలైన ‘విస్మయ’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఇలా జరిగిందని ఆమె వెళ్లడి చేసింది. శృతి వ్యాఖ్యలను ఆ చిత్ర దర్శకుడు అరుణ్‌ వైధ్యనాథ్‌ కొట్టి పారేశాడు.

దర్శకుడు చెప్పకుండానే అర్జున్‌ తనను అసభ్యంగా తాకాడని శృతి చేసిన విమర్శలపై దర్శకుడు అరుణ్‌ స్పందించారు. సినిమాలో కథానుసారంగా కొన్ని సార్లు హీరో - హీరోయిన్స్‌ మద్య రొమాన్స్‌ ను పండించేందుకు కొన్ని సీన్స్‌ రాయాల్సి ఉంటుంది. అలాంటివి హీరో - హీరోయిన్స్‌ కు పూర్తిగా చెప్పలేం. వారు కొన్ని సార్లు తాము చెప్పేవాటిని ఇంప్రొవైజ్ చేసి - వారే చేస్తూ ఉంటారు. అలాగే ఈ చిత్రంలోని ఆ సీన్‌ విషయంలో జరిగి ఉంటుంది తప్ప - అర్జున్‌ అలా చేసి ఉండడు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

శృతి చెబుతున్న ఆ సీన్‌ ను ఇంకాస్త సీరియస్‌ గా - ఘాటుగా రాసుకున్నాను. కాని అర్జున్‌ గారు నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ వయస్సులో ఇలాంటి సీన్స్‌ చేస్తే బాగుండదంటూ చెప్పాడు. అందుకే ఆ సీన్‌ లో కాస్త రొమాన్స్‌ తగ్గించానని - ఆయన ఎప్పుడు కూడా ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం తాను ఎరుగను అంటూ చెప్పుకొచ్చాడు. అర్జున్‌ మరియు శృతి లు నాకు మంచి స్నేహితులు. వారిద్దరి మద్య ఇలాంటి వివాదం ఏర్పడటం నాకు బాధగా ఉందని, శృతితో ఈ విషయమై చర్చించాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. షూటింగ్‌ సందర్బంగా ఎలాంటి అనుచుత సంఘటనలు జరగలేదని తాను భావిస్తున్నట్లుగా ఆయన అన్నాడు.