Begin typing your search above and press return to search.

రామ్ తో జాతిరత్నం.. ఉస్తాద్. ఇస్మార్ట్ కాంబో..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 7:03 AM GMT
రామ్ తో జాతిరత్నం.. ఉస్తాద్. ఇస్మార్ట్ కాంబో..!
X
జాతిరత్నం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న అనుదీప్ కెవి ఆ మూవీ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ప్రిన్స్ వచ్చింది. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని టాక్. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం జాతిరత్నం తరహాలోనే మొత్తం డైలాగ్స్ తో నడిపించడమే ప్రిన్స్ సినిమాను రొటీన్ అనిపించేలా చేశాయని చెప్పొచ్చు. జాతిరత్నం సినిమానే మళ్లీ చూసినట్టుంది అంటూ పబ్లిక్ చెబుతున్నారు.

ప్రిన్స్ తో అనుదీప్ కెవి అంచనాలను అనుకోలేదు. ఈ మూవీ తర్వాత రెండు భారీ ప్రొడక్షన్స్ నుంచి అనుదీప్ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి హారిక హాసిని క్రియేషన్స్ కాగా.. మరొకటి మైత్రి మూవీ మేకర్స్. హారిక హాసిని బ్యానర్ లో విక్టరీ వెంకటేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ తో రామ్ హీరోగా అనుదీప్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మొదటి సినిమా పిట్టగోడ పెద్దగా ఎవరికి తెలియకపోయినా జాతిరత్నంతో ప్రేక్షకులను మెప్పించిన అనుదీప్ ప్రిన్స్ హిట్టు కొడితే లెక్క వేరేలా ఉండేది. కానీ ప్రిన్స్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అందుకే ఈ టైం లో రామ్ అనుదీప్ తో సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు ఆడియన్స్.

ది వారియర్ సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనుదీప్ డైరక్షన్ లో రామ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి రామ్ తో అయినా అనుదీప్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆశిద్దాం. హడావిడిగా సినిమా చేయకుండా రామ్ సినిమా అయినా అనుదీప్ కొద్దిగా టైం తీసుకుని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రావాలని కోరుతున్నారు ఆడియన్స్. జాతిరత్నాలు సినిమాతో డైరక్టర్ గా పీక్స్ లో క్రేజ్ తెచ్చుకున్న అనుదీప్ మళ్లీ అలాంటి సూపర్ హిట్ ఎప్పుడు కొడతాడో చూడాలి. కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుదీప్ కథలో కూడా కొంత డెప్త్ ఉండేలా చూసుకుంటే అతను కూడా టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకునే ఛాన్స్ ఉంది.