Begin typing your search above and press return to search.

అలవాటులో పొరపాటు.. కాజల్ కు క్లాస్!

By:  Tupaki Desk   |   18 Aug 2016 11:10 AM IST
అలవాటులో పొరపాటు.. కాజల్ కు క్లాస్!
X
అలవాటులో పొరపాటుగా చేసిందో లేక అత్యుత్సాహంతో చేసిందో కానీ.. చెయ్యకూడని పని ఒకటిచేసి డైక్రెక్టర్ తో ఫుల్ గా క్లాస్ పీకించుకుందట హీరోయిన్ కాజల్. చెప్పిన సీన్ చెప్పినట్లు చేయడం లేదా.. లేక షూటింగ్ కి సరైన సమయంలో రావడం లేదా.. ఎందుకు డైరెక్టర్ కాజల్ ని తిట్టాడు అని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసిందట. అజిత్ నటిస్తున్న 57వ చిత్రంలో హీరోయిన్ ఎవరన్న విషయంపై చాలా చర్చ జరగడం, ఈ ప్లేస్ కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలనకు రావడం, చివర్లో అనుష్క పేరు ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే కాజల్ అగర్వాల్ ను ఆ అదృష్టం వరించింది.

అయితే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ప్రస్తుతం ఐరోపా దేశంలో జరుగుతుంది. ఈ షూటింగ్ సమయంలో నటి కాజల్ అగర్వాల్ తన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిందట. ప్రతీ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసే అలవాటున్న కాజల్ తన న్యూ లుక్స్ కూడా పోస్ట్ చేసేసిందట. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో బెంగాల్ బ్యూటీగా నటిస్తున్న కాజల్ న్యూ లుక్ ని సీక్రెట్ గా ఉంచాలని భావించిన డైరెక్టర్.. ఆ ఫోటోలు బయటకు వెళ్లిపోవడంతో ఫుల్ గా క్లాస్ పీకాడట. ఇంకెప్పుడూ ఈ సినిమాకు సంబందించిన ఫోటోలను - షూటింగ్ విశేషాలను ట్విట్టర్ - ఫేస్ బుక్స్ లో పోస్ట్ చేయొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట.

ఇలా అలవాటులో పొరపాటుగా చేసిన పనికి కాజల్ కు డైరెక్టర్ చేతిలో ఫుల్ గా పడిపోయాయట. ఇదే అనుభవంతో ఎందుకైనా మంచిదని నటి అక్షరకు కూడా ముందుజాగ్రతగా "నువ్వు కూడా ఇలాంటి పనులేమీ చేయకు" అని చెప్పారట. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ నటిస్తున్నారు. డైరెక్టర్ శివ.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.